అయోధ్యలోని శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా…
- అంగరంగ వైభవంగా స్వామి వారికి పూజలు
- మారు మోగిన రామ నామం..
- పులకించిపోయి పరవశించిన జనం

నిజామాబాద్ అర్బన్, జనవరి 22 ( లోకం తీరు న్యూస్ ) : 41 వ డివిజన్ , చంద్రశేఖర్ కాలనీలో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో అయోధ్య రామ మందిరంలో జరుగుతున్న బాల రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఆలయం యొక్క కమిటీ సభ్యులంతా కలిసి ఆలయంలో ఉదయం స్వామివారిని అభిషేకాలతో అభిషేకించి అంగరంగ వైభవంగా పూజలు జరిపారు.అదేవిధంగా మహా అన్నదానాన్ని నిర్వహించారు , సాయంత్రం స్వామివారికి శోభాయాత్ర కూడా నిర్వహించడం జరిగింది.స్వామివారి శోభాయాత్ర సమయంలో కాలనీలోని ఇద్దరు పిల్లలు శ్రీరాముడు మరియు సీత వేషధారణలో వచ్చి అందరినీ ఆకట్టుకోవడం జరిగింది . ఈ కార్యక్రమాలలో భాగంగా కమిటీ సభ్యులు, కాలనీవాసులు స్వామి వారికి జరిగే ప్రతీ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారికి జరిగిన అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయడం విశేషం.ఈ యొక్క శోభాయాత్ర కార్యక్రమంలో 41 వ డివిజన్ కార్పొరేటర్ దంపతులు కూడా పాల్గొని ఆ స్వామి వారి యొక్క సేవలో పాలు పంచుకోవడం జరిగింది.
