Take a fresh look at your lifestyle.

PDSU డిమాండ్…..

0 147

ఇంజనీరింగ్ కళాశాలగా ఉన్నతీకరించాలి..

PDSU డిమాండ్…..

 

నిజామాబాద్ ,జనవరి 24  ( లోకంతీరు న్యూస్ ): నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాల ఉన్నతీకరించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు.)నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా PDSU నగర అధ్యక్షులు ఎస్.కె. అషూర్ మాట్లాడుతూ,
పేద విద్యార్థులు ఇంజనీరింగ్ చదవడానికి ఆసక్తిగా ఉన్న ఆర్థిక ఇబ్బందుల ద్వారా చదవలేకపోతున్నారన్నారు.

నిజామాబాద్ జిల్లా ప్రజల మరియు విద్యార్థుల ఆకాంక్ష మేరకు ఇంజనీరింగ్ కాలేజీ గా పాలిటెక్నిక్ కాలేజ్ ని అప్గ్రెడ్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలోనే పి.డి.ఎస్.యు. విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగిందనీ, తద్వారా గత ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాల గా అప్గ్రెడ్ చేస్తామని చెప్పడం జరిగిందన్నారు. కానీ నిజామబాద్ జిల్లాలో ఉన్న గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అప్గ్రేడ్ కాలేదని తెలిపారు. చాలా మంది విద్యార్థులు ఇంజనీరింగ్ ఉన్నత చదువులకు దూరమయ్యారని, ముఖ్యంగా విద్యార్థినీలు చదవాలని ఆసక్తిగా ఉన్నా దూరప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారన్నారు.

రూరల్ ప్రాంత విద్యార్థులు ఇంజనీరింగ్ చదవాలని ఆసక్తి ఉన్న వాళ్ళ ఆర్థిక భారంతో చదవలేక పోతున్నారన్నారు. వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే చొరవ తీసుకొని నిజామాబాద్ నగరంలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాల గా అప్గ్రెడ్ చేయాలని కోరారు. ఆ దిశగా నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు చొరవ తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో PDSU నగర కోశాధికారి తిరుమలేష్ నగర నాయకులు సలీం, సృజన్, విజయ్,సమీర్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు….

Leave A Reply

Your email address will not be published.