పాస్టర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక

భీంగల్ , జనవరి 26 ( లోకం తీరు ) : భీంగల్ మున్సిపల్ పరిధిలో శుక్రవారం నాడు పాస్టర్స్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఇమనేయల్,ఉపాధ్యక్షుడిగా పౌలు, ప్రధాన కార్యదర్శి గా మనోహర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రభాకర్, కోశాధికారి గా ప్రభుదాస్, సంయుక్త కార్యదర్శి గా జీవన్, సలహా దారులుగా సోలామాన్ రాజు,దివాకర్, గౌరవ సలహా దారులుగా ఫిలిప్, జోసఫ్ లను ఏకిగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఇమనేయల్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అధ్యక్షుడిగా గెలిపించినందుకు క్రిస్టియన్ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు.