Take a fresh look at your lifestyle.

గ్రామ పంచాయితీలకు ఇన్చార్జిలుగా ప్రధానోపాధ్యాయులను నియమించడాన్ని ప్రభుత్వం విరమించుకోవాలి

0 1,515

గ్రామ పంచాయితీలకు ఇన్చార్జిలుగా ప్రధానోపాధ్యాయులను నియమించడాన్ని ప్రభుత్వం విరమించుకోవాలి

-PDSU డిమాండ్

నిజామాబాద్, జనవరి 29 ( లోకం తీరు ) :  రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ ఇన్చార్జీలుగా ప్రధానోపాధ్యాయులకు కేటాయించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(PDSU) ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా PDSU నిజామబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు నగర అధ్యక్షులు ఎస్కే. అషుర్ లు మాట్లాడుతూ, ఇప్పటికే ఇన్చార్జి మండల విద్య అధికారులు, ప్రధానోపాధ్యాయులతో మధ్యాహ్న భోజనం పథకాలతో విద్యార్థులకు అందవలసిన తరుణంలో విద్య అందకుండా ఉందన్నారు. ఇటువంటి ఇన్చార్జి పాలన వ్యవస్థలో విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు చదువు పరిపూర్తిగా చెప్పలేక పోతున్నారన్నారు. అటు మధ్యాహ్న భోజన పథకానికి ఇన్చార్జిలుగా వ్యవహరిస్తూ, ఇటు పరిపూర్తిగా విద్యార్థులకు విద్యను అందించలేకపోతున్నారు. కాబట్టి వెంటనే మధ్యాహ్న భోజన పథకానికి ప్రధానోపాధ్యాయులను ఇన్చార్జిగా తొలగించాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ ఇన్చార్జి బాధ్యతలు కూడా ప్రధానోపాధ్యాయులకు ఇవ్వడం ద్వారా పూర్తిస్థాయిలో విద్యను విస్మరించడమే పూర్తిస్థాయిలో విద్యను విద్యార్థులకు అందకుండా నష్టపరచడమే అవుతుందని తెలిపారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వము విరమించుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. పూర్తిస్థాయిలో ప్రధానోపాధ్యాయులను మండల విద్యాధికారులను నియమించాల్సిందిగా డిమాండ్ చేశారు.లేదంటే విద్యా పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని, అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర PDSU నాయకులు సలీం, నాగేష్, నజీర్, మంగ, వర్ధన్, రంజాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.