పసుపు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ట్రేడర్స్ సంసిద్ధంగా ఉండాలి..
- పసుపు రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి
- పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి.


నిజామాబాద్, జనవరి 29 ( లోకం తీరు ) : పసుపు రైతుల కు గిట్టుబాటు ధర కల్పించేందుకు డీలర్లు, కొనుగోలుదారులు సంసిద్ధంగా ఉండాలనీ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి జిల్లా కేంద్రంలోని శ్రద్ధానంద్ గంజి లో గల నిజామాబాద్ మర్చంట్స్ అసోసియేషన్ భవనంలో పసుపు ట్రేడర్స్, అమ్మకం కొను గోలుదారులతో ఎంపీ ధర్మపురి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లా డుతూ పసుపు రైతులు పసు పుని పూర్తిగా ఎండబెట్టిన తర్వాతనే మార్కెట్ యార్డ్ కి తీసుకురావాలని కోరారు. రాష్ట్రంలోని జిల్లాకు పసుపు బోర్డు తేవడం తన అదృష్టంగా భావిస్తూ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పసుపు పండించే రైతన్నలకు గతంలో కంటే ఈ సంవత్సరం నుండి గిట్టు బాటు ధర సుమా రు రూ14 వేల వరకు ధర రావడం హర్షిం చదగ్గ విషయ మన్నారు. రైతన్నలు కూడా పంటను కృత్రిమంగా పండిస్తూ నాణ్య మైన పంట పండించే విధంగా మందుల వాడకం తగ్గించాలని తగిన సలహాలు సూచనలు ఇచ్చారు. ఎవ్వరికి ఇబ్బం ది కలగ కుండా రైతన్నలు పండించిన పంటను ఎండించి శుభ్రపరిచి మార్కెట్ లోని కొనుగోలుదారు లకు అమ్మ కాలు జరిపి మద్దతు ధర పొందాలని చెప్పారు. ఈ సంవ త్సరమే కాకుండా రాబోయే రోజుల్లో కూడా పసుపు కు రూ20వేల గిట్టుబాటు ధర వచ్చేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని హామీ ఇచ్చారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని కోరారు. పసుపు ఎగుమతిపై కేంద్రం ప్రధాని మోడీ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలోమార్కెట్ యార్డ్ కార్యదర్శి మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు లాబిశెట్టి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కమల్ కిషోర్ ఇనాని, కోశాధికారిగోపాల్ రమేష్, బిజెపి కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, శ్రద్ధానంద్ గంజ్ లోని ట్రేడర్లు,కొనుగోలుదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..