రాష్ట్ర మంత్రులను కలిసిన మండల నాయకులు

కామారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 23 ( లోకంతీరు ) : హైదరాబాద్ రాజధానిలో పంచాయత్ రాజ్ మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడమ బొజ్జ తో మాచారెడ్డి మండల అధ్యక్షులు నౌసిలాల్ నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నునావత్ గణేష్ నాయక్, బన్సీ నాయక్, తిరుపతి, మల్లారెడ్డి నాయక్, రాజు నాయక్, దాబా రాజు, రాములు నాయక్, కిరణ్, శంకర్ నాయక్ వీరు కలిసి మాచారెడ్డి మండల కేంద్రంలో అన్ని గ్రామాల రోడ్లు మరియు వివిధ సమస్య పట్ల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ దృష్టికి తిసుకవెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులను పనులు చేయాలని చూపించారు. సోమరం పేట, బంజేపల్లి, మోటర్ పడ్డ లోద్ది, చిక్కల్లోని లొద్ది, సర్దాపూర్, సోమార్పేట్ తాండ, నెమలిగుట్ట, మర్రి తండా వర్ష ప్రభావంతో తెగిపోయిన రోడ్ల గురించి చెరువుల గురించి మంజూరు చేయాలని కోరారు.