Take a fresh look at your lifestyle.

మోదీ చిత్రపటానికి పాలాభిషేకం…

0 1,387

నిజామాబాద్ ఫిబ్రవరి 1(లోకంతీరు): బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఓబిసి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్ మాట్లాడుతూ బీహార్ మాజీ ముఖ్యమంత్రి స్వాతంత్ర సమరయోధుడు లోక్ నాయక్ పేద వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం రైతుల హక్కుల కొరకు తన జీవితాన్ని అంకితం చేసిన మహా నాయకుడు కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి ఓబీసీ మోర్చా అర్బన్ అసెంబ్లీ ఆధ్వర్యంలో దేవి టాకీస్ ప్రక్కనగల సిజరింగ్ హెయిర్ కటింగ్ సెలూన్ ఎదుట ఓబిసి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్ పాలభిషేకం

చేసి మాట్లాడుతూ బీహార్ రాష్ట్రంలో చిన్న మారుమూల కర్పూరి గ్రామం లో కర్పూరి ఠాకూర్ 1924 జనవరి 24 తేదీన అత్యంత వెనుకబడిన నాయి బ్రాహ్మణ మంగలి సమాజంలో జన్మించారని తన గ్రామంలో ఉపాధ్యాయుడిగా పిల్లలకు బోధించడం జరిగిందని 1952లో శాసనసభలుగా ఎన్నిక కావడం జరిగింది 1970 నుండి 71 వరకు సోషలిస్టు పార్టీ నాయకుడిగా తొలిసారిగా కాంగ్రెస్తతర పార్టీ ముఖ్యమంత్రిగా చేపట్టడం జరిగిందని రెండోసారి 1977 నుండి 79 వరకు ముఖ్యమంత్రి బాధ్యత నిర్వహించి నిరంతరం ప్రజల కోసం శ్రమించిన గొప్ప మహనీయుడని స్వామి యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో:- ఓబీసీ మోర్చా అర్బన్ కన్వీనర్ గిరిబాబు,  బిజెపి నాయకులు రాగి నారాయణ యాదవ్, మోర్చా మండల అధ్యక్షులు మారుతి, నరేశ్, మోర్చా నాయకులు రాజ్ కుమార్, లక్ష్మణ్ గౌడ్, హనుమాన్లు, నాయి గంగాధర్, ఓంకార్, ఆనంద్, నాయి బ్రాహ్మణ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.