Take a fresh look at your lifestyle.

విద్యార్థులు ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలి…

0 1,295

విద్యార్థులు ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలి

  • ఎం.సుధాకర్, పి డి యస్ యు మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు.

నిజామాబాద్ ,ఫిబ్రవరి 07 ( లోకం తీరు ) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిరాజ కళాశాలలో “విద్యా రంగ సమస్యలు – కర్తవ్యాలు” అనే అంశంపై సెమినార్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి సమావేశానికి పి డి యస్ యు నగర అధ్యక్షులు ఎస్కే అషూర్ అధ్యక్షత వహించగా ముఖ్య వక్తగా వచ్చిన పి డి యస్ యు మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులందరూ తమ అకాడమిక్ చదువులతోపాటు సమాజాన్ని కూడా అర్థం చేసుకోవాలని, ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలన్నారు. ప్రశ్నిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ప్రశ్నిస్తేనే సమాజ మార్పు జరుగుతుందన్నారు. ప్రశ్న లేకపోతే నియంతృత్వం పెరుగుతుంది అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలన్నారు. విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి బడుగు బలహీన వర్గాలకు ఉచిత నాణ్యమైన విద్యను అందించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన పోరాటాల్లో విద్యార్థులే అగ్రభాగాన ఉన్నారన్నారు. భగత్ సింగ్, జార్జిరెడ్డి, జంపాల, రంగవల్లి, శ్రీపాద, శ్రీహరిల పోరాటాల స్ఫూర్తిని కొనసాగిస్తూ నేటి విద్యార్థులు ఉద్యమాలలో ముందు వరుసలో ఉండాలని పిలుపునిచ్చారు.
ఇంగ్లీష్ హెచ్.ఓ.డి డాక్టర్ శ్యాం కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రగతిశీలంగా ఆలోచించాలన్నారు. తమ చదువులు చదువుతూనే, సమాజాన్ని చదవాలన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలను కాపాడుకోవడంలో విద్యార్థులే ముందుండాలని పిలుపునిచ్చారు.పి డి యస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి కే.గణేష్ మాట్లాడుతూ… విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్స్, రియంబర్స్మెంట్, మెస్ చార్జీలను వెంటనే విడుదల చేయాలని, విద్యారంగంలో ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టులను భర్తీ చేయాలన్నారు.

కేజీ నుంచి పీజీ వరకు ఉన్న అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.సెమినార్ తర్వాత   పి డి యస్ యు ప్రభుత్వ గిరిరాజ్ కళాశాల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో పి డి యస్ యు నగర నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.