Take a fresh look at your lifestyle.

జాతీయ రహదారిపై దాబాల హవా….పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు

0 1,323

జాతీయ రహదారిపై దాబాల హవా..!

  • రాత్రి పగలు తేడా లేకుండా దాబాల జోరు
  • సమయపాలన లేకుండా నిరంతరంగా ఓపెన్
  • రోడ్డు ప్రమాదాల కు ఓ కారణం
  • పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు

కామారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 14 ( లోకంతీరు) : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని 161 జాతీయ రహదారి వెంట దాబాలలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.ప్రభుత్వం మద్యం దుకాణాలు, బార్లకు, అనుమతులు ఇవ్వకపోయినా అంతకుమించి అమ్మకాలు దాబాలలో జరుగుతున్నాయి.కేవలం ప్రయాణికుల వాహనదారుల ఆకలి తీర్చేందుకు ఏర్పాటైన దాబాలలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి.పగలు రాత్రి తేడాలు లేకుండా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు దర్జాగా కొనసాగిస్తున్నారంటే హైవేపై మద్యం అమ్మకాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.జుక్కల్ నియోజకవర్గం పరిధిలోని 161 జాతీయ రహదారి సుమారు 75 కిలోమీటర్ల పొడవు ఉంది.
మహారాష్ట్ర సరిహద్దు లోని సలబత్పూర్ గ్రామం నుండి మొదలుకొని నిజాంసాగర్ మండలం వెలగనూరు వరకు నియోజకవర్గంలో జాతీయ రహదారి ఉంది.
ఈ జాతీయ రహదారిపై ఇప్పటికే చాలావరకు మేజర్ యాక్సిడెంట్లు జరిగాయి. అయినప్పటికిని సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికి ఇలాంటి చర్యలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.
అటు ఆప్కారి శాఖ అధికారులు ఇటు పోలీసులు పట్టించుకోకపోవడంతో మద్యంతోపాటు ,మంచింగ్ కూడా కొదవ లేకుండా అమ్మకాలు జరుగుతున్నాయి.దబాలలో ఇచ్చే ఆమ్యామ్యాలకు ఆశపడి పట్టించుకోకపోవడంతో మద్యం విక్రయాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా. ధాబాల వద్ద ఎలాంటి నిబంధనలను పాటించకుండా పెద్ద పెద్ద లారీలు, కంటైనర్లను ఆపి డ్రైవర్లుమద్యం సేవిస్తున్నారు.దాంతో వారు మద్యం మత్తులో నిద్రమత్తులో వాహనాలు నడిపి, ప్రమాదాలకు కారణమవుతున్నారు.ఈ విషయం అధికారులు తెలిసినప్పటికిని పట్టించుకోకపోవడం గమనార్హం.
రోడ్డు భద్రత వారోత్సవాల సమయంలో మాత్రమే జిల్లా అధికార యంత్రాంగానికి, వైద్యా ఆరోగ్య శాఖకు, రవాణా శాఖకు, రోడ్డు భవనాల శాఖకు, జాతీయ రహదారి అథారిటీ బాధ్యులకు నియమ నిబంధనలు గుర్తుకు వస్తాయి.
ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం ట్రాఫిక్ రూల్స్,సేఫ్టిమేజర్స్ గుర్తుకు వస్తాయంటే అతిశయోక్తి కాదు
దాంతోనే జాతీయ రహదారిపై ఎన్ని ప్రమాదాలు జరిగిన ఎన్ని ప్రమాదాలు జరిగిన ఎవరు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు 161 జాతీయ రహదారిపై ఉన్న దాబాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.