Take a fresh look at your lifestyle.

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం….

0 1,557

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

• ఇంటర్ విద్య అధికారి రఘురాజ్

నిజామాబాద్, ఫిబ్రవరి 22( లోకంతీరు ) : ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఇంటర్ విద్యార్థి శ్రీ రఘురాజ్ తెలియజేశారు. ఫిబ్రవరి 28వ తేదీ నుండి మార్చి 19వ తేదీ వరకు జరిగే పరీక్షలకు జిల్లాలో 57 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తెలియజేశారు. 16 ప్రభుత్వ కళాశాలలు, 2 ఎయిడెడ్ కళాశాలలు, 2 సాంఘిక సంక్షేమ కళాశాలలు, 6 మోడల్ కళాశాలలు, 2 మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాలలు,ఒక బీసీ సంక్షమ కళాశాల, 26 ప్రైవేట్ కళాశాలలు, ఒక ప్రభుత్వ పాటశాల,ఒక ప్రైవేట్ పాఠశాల పరీక్షల నిర్వహణ కోసం ఉపయోగిస్తున్న మని అన్నారు. 

జిల్లన్లో మొత్తం 35,346 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని అన్నారు. వీరిలో మొదటి సంవత్సరం జనరల్ 14,965 మంది, 2,399 మంది ఒకేషనల్ విద్యార్థులు హాజరవుతారని అన్నారు. రెండవ సంవత్సరం రెగ్యులర్ జనరల్ విద్యార్థులూ13,986 మంది, ప్రైవేట్ 1,804 మంది. విద్యార్థులు, రెండవ సంవత్సరం ఒకేషనల్ రెగ్యులర్ 1,999 మంది విద్యార్థులు, ప్రైవేట్ 193 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని జిల్లా ఇంటర్ విద్య అధికారి తెలిపారు. మొదటి సంవత్సరం మొత్తం విద్యార్థులు 17,364 కాగా రెండవ సంవత్సరం విద్యార్థులు 17,982 మంది ఉన్నారని తెలిపారు.

నిమిషం నిబంధన….

నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రం లోకి విద్యార్థులకు అనుమతి ఉండదని జిల్లా ఇంటర్ విద్యా అధికారి రఘురాజ్ తెలిపారు. ఉదయం 8.30 గంటల వరకు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్ లను, ఇతర ఏ పత్రాలను, కాగితాలను అనుమతించబోమని అన్నారు. పరీక్షల నిర్వహణ లో చీఫ్ సూపరింటెండెంట్ లు, డిపార్ట్మెంట్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తారని అన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సమయానికి చేరుకునే విధంగా టి ఎస్ ఆర్టీసి బస్సులు నడపాలని కలెక్టర్ ఆదేశించారు అని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించడం జరుగుతుందని అన్నారు. అలాగే ప్రతి పరీక్ష కేంద్రం లో ఒక ఏ. ఎన్. ఏం తోవపటు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుతున్నారు తెలియ జేశారు. పరీక్షల నిర్వహణ సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తెలిపారు. అలాగే పరీక్షల నిర్వహణ రచన తర్వాత జవాబు పత్రాల బెండల్ లను పోస్ట్ ఆఫీస్ ల ద్వారా వాటిని జిల్లా కేంద్రం లోని డి. ఆర్.డి. సి. కేంద్రానికి తరలించే ఏర్పాట్లు పోస్ట్ ఆఫీసు ల ద్వారా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మూడు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు, మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు పరీక్షల నిర్వహణ పర్యవేక్షిస్తారు అని తెలిపారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందంలో రెవెన్యూ అధికారి, పోలీస్ అధికారితో పాటు ఒక సీనియర్ అధ్యాపకుడు ఉంటారని తెలిపారు.

ఏ సమస్య ఎదురైన వెంటనే పరిష్కరించేందుకు జిల్లా కేంద్రంలో నీ ఇంటర్ విద్యా కార్యాలయంలో పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు శ్రీ రవికుమార్, శ్రీ రజీయుద్ధిన్ ఆస్లామ్, దేవరామ్ లు అందుబాటులో ఉంటారని తెలిపారు.

విద్యార్థులు ఎలాంటి పుకార్లు నమ్మరాదు…..

పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశామని విద్యార్థులు ఎలాంటి పుకార్లు నమ్మవద్దని సూచించారు. పరీక్ష రాసే సమయంలో విద్యార్థిని, విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు లోను కారదని అన్నారు. బాగా చదివి ప్రతి ప్రశ్న కు సమాధనం రాయాలని సూచించారు.

హాల్ టికెట్ ల పంపిణీ విషయంలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయ రాదని అన్నారు. ఆన్లైన్ లో క్వా విద్యార్థులు హాల్ టికెట్ లు పొందవచ్చన్నారు.

Leave A Reply

Your email address will not be published.