గొర్రెల పంపిణీ లో స్కామ్ లో నలుగురు అధికారుల అరెస్ట్
-
కామారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖలో అవినీతి తిమింగలాలపై ఏసీబీ దాడులు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 22 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ లో ఒక్కసారిగా అవినీతి తిమింగలాలపై ఏసీబీ దాడులు జరిపారు. వారి సమాచారం మేరకు అప్పటి గొర్రెల పంపిణీ స్కీమ్ లో భాగంగా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ధర్మపురి రవి ఏ4, ఆదిత్య కేశవ సాయి మేడ్చల్ జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నారు. ఏ5 గా ఉన్న రఘుపతి రెడ్డి డిప్యూటీ డైరెక్టర్ డిస్టిక్ గ్రౌండ్ వాటర్ హైదరాబాద్ గా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఏ6 డిప్యూటీ డైరెక్టర్ గణేష్ లను ఏసీబీ దాడులలో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
పశుసంవర్ధక శాఖ లో జరిగిన అవినీతిలో భాగంగా గొర్రెల పంపిణీలో 2.10 కోట్ల స్కామ్ గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితులు వారి వారి హోదాలలో నిర్వహిస్తున్నారు. పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రవి, కామారెడ్డి ఏరియా హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య, రఘుపతి రెడ్డి, గణేష్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు తెలిపారు.