Take a fresh look at your lifestyle.

ఉచిత కంటి వైద్యశిబిరం…లయన్స్ క్లబ్ ఆఫ్ మోర్తాడ్ ఆద్వర్యంలో

0 1,440

లయన్స్ క్లబ్ ఆఫ్ మోర్తాడ్ ఆద్వర్యంలో…ఉచిత కంటి వైద్యశిబిరం

మోర్తాడ్, ఫిబ్రవరి 23 ( లోకంతీరు ) : ప్రపంచ వ్యాప్తంగా లయన్స్ క్లబ్ ఆద్వర్యంలో సేవలు అందించడం. జరుగుతొందని ఇందులో ముఖ్యంగా ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు సేవలందించడం ఎంతో సంతోషంగా ఉందని క్లబ్ అధ్యక్షులు మామిడాల మనోహర్ అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని పద్మశాలి సంఘ భవనం లో శుక్రవారం లయన్స్ క్లబ్ మోర్తాడ్ అద్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిభిరంలో ఉచిత కంటి వైద్యం కోసం సమారు – 150 మంది రోగులు చికిత్సలు పొందారు, ఇందులో 50 మందికి కంటి ఆపరేషన్  చేయల్సి ఉందని వైద్యులు నిర్ధారించారు. అనంతరం క్లబ్ అద్యక్షులు మనోహర్, వైద్యులు మాట్లాడుమా – ఆపరేషీన్ కోసం నిర్దారించిన రోగులకు జిల్లా కేంద్రంలో చికిత్సలు జరపనున్నట్లు తెలిపారు. ముందుగా శిబిరానికి వచ్చిన వారికి కంటి డ్రాప్స్ వెసిన అనంతరం కంటి పరిక్షలు చేయడం జరిగిందన్నారు. ఉచిత కంటి వైద్య శిబిరాల ద్వారా సేవలందించాలనే ఉద్దేశ్యంతో శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు ప్రోగ్రాం అద్యక్షులు నిమ్మ రాజన్నతో పాటు గోపిడి సత్యనారాయణ, బోగ ఆనంద్, జలెండ్ల లింబాద్రి, సామ శ్రీనివాస్, ఏలాల రాజ్ పాల్, పబ్బ సంజీవ్, హజారి శ్రీదర్, ఎలాల మోహన్, దడివే నవీన్, నూతికట్టు గిరిధర్, జక్కం రాజు ఆర్య, ఎలాల భూమారెడ్డి, తీగల రమేష్, దడివే పెద్ద మోహన్, కుదురుపాక ప్రవీణ్ వాంకార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.