గత ప్రభుత్వం బిఆర్ఎస్ అవినీతిని బయటపెట్టిన – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ ,ఫిబ్రవరి 24 ( లోకంతీరు ) : గత ప్రభుత్వం లో జరిగిన అవినీతిని ఒక్కొక్కటిగా బయట పెడతామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు.శనివారం
ఇందూర్ బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో మాట్లాడుతు పేదోని సొంత ఇల్లు సాకారం కోసం గత ప్రభుత్వం తీసుకొచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మన నిజామాబాదు కి 2,330 మంజూరు అయితే పూర్తి అయినవి 648 అని వీటి అభ్యర్థుల ఎంపిక కూడా జీవో కు వైతిరేకంగా జరిగిందని, అన్నారు. జీవో ప్రకారం అర్బన్ లొ కేటగిరి ప్రకారం ఎస్ సి -17%, ఎస్ టి-6%, మైనారిటీ -12% మిగతా వర్గాల వారిని సమానం చేస్తూ ఆర్ధిక రేఖకు దిగువ ఉన్న వారికీ కేటాయింపు జరగాలి కానీ గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఒక వర్గానికి 48% కేటాయించి మిగతా వర్గాల ప్రజలను మోసం చేసారని, కేటాయించిన వాటిలో కూడా బిఆర్ఎస్ నాయకుల అనుచరులకు, ఇల్లు ఉన్న వారికే ఇల్లు ఇచ్చారని, జీవో ప్రకారం వార్డ్ సభ పెట్టి అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయాలి కానీ అలా జరగలేదని అన్నారు,కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుందని అన్నారు, వెంటనే అర్హులైన పేదవారిని ఎంపిక చేసి, ఆ ఇళ్లను మరమత్తు చేసి ఇవ్వాలని, దానికి స్పెషల్ ఫండ్ కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలనీ డిమాండ్ చేసారు,జిల్లా మంత్రిగారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు, అలాగే నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో కోట్ల రూపాయలు వచ్చిన నగరంలో డ్రైనేజీ వ్యవస్థ ఆధ్వనంగా ఉందని గత పాలకులు నిధులు స్వాహా చేసి పాలనను గాలికి వదిలేసారని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 కింద 162 కోట్ల రూపాయలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం విడుదల చేసిందని అలాగే వాటర్ సప్లై కోసం 217 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని తప్పకుండ ఆ నిధులతో త్వరతగాతిన పనులు పూర్తి అయ్యేలా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది,టియూ ఎఫ్ ఐడీసీ నిధులు 60 కోట్లు మరియు 61 కోట్ల నిధులు .ఎస్ డి ఎఫ్ 100 కోట్లు నిధులు గతంలో మంజూరు అయినవి వాటిని ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేయడం జరిగిందని, మా నియోజకవర్గ అభివృద్ధి కి వెంటనే వాటిని కూడా విడుదల చేయాలనీ జిల్లా ఇంచార్జ్ మంత్రి , ముఖ్యమంత్రి అసెంబ్లీ లొ వినతిపత్రం ద్వారా కోరడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కూడా సరైన మౌలిక సదుపాయలు లేవని వాటికీ కూడా నిధులు మంజూరు చేయాలనీ, వచ్చే విద్య సంవత్సరానికి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సౌకర్యల కల్పనకు కృషి చేస్తానన్నారు,అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడితే ఆరు గ్యారెంటీలు మాట్లాడుతున్నారు వాటితో పాటు మేనిఫెస్టో లొ ఉన్న హామీల సంగతి ఏంటి అని ప్రశ్నించారు. వెంటనే రైతులకు 2 లక్షల రుణమాఫీ, మహిళలకు 2500,నిరుద్యోగ భృతి అవన్నీ అమలు చేయాలనీ, ఆరు గ్యారెంటీలు కూడా ఎన్నికల కోడ్ కు ముందు అమలు చేయాలని, ఎన్నికల కోసం, ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా చేస్తుందని మండిపడ్డారు, ఈ కార్యక్రమంలొ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మీనారాయణ,జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంకర్ లక్ష్మి నారాయణ, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి,కార్పొరేటర్ మాస్టర్ శంకర్,మండల అధ్యక్షులు పుట్ట వీరేందర్, గడ్డం రాజు, రోషన్ లాల్ భోర, బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.