నిజామాబాద్ , మార్చి 11 ( లోకంతీరు ) : కళ్యాణ లక్ష్మీ, వివిధ రకాల పెళ్ళిల కోసం ప్రభుత్వం లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వాలని ప్రభుత్వన్ని కోరారు. సోమవారం ఇందూర్ పట్టణం రాజీవ్ గాంధీ ఆడిటోరియం లొ ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి /షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలొ ముఖ్య అతిథులుగా పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతు పేదింటి ఆడబిడ్డ పెళ్ళికి, వారి కుటుంబానికి ఆర్ధిక భరోసాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష నూటపాదహారు రూపాయలు పంపిణీ చేస్తుందని,ఈ చెక్కులు జారీ చేయడంలో జాప్యం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అర్జీ పెట్టుకున్న అర్హులందరికీ వీలైనంత త్వరగా చెక్కులు విడుదల చేయాలనీ సూచించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానన్న హామీ నెరవేర్చాలని ఆడబిడ్డలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని అన్నారు . నగరంలో అర్హులైన 895 మందికి చెక్కుల పంపిణీ జరుగుతుందని అందులో కల్యాణ లక్ష్మి 211, షాది ముబారక్ 684 పంపిణీ చేయడం జరుగుతుంది అన్నారు. అనంతరం అర్హులైన వారికీ వారి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం లొ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, బిజెపి కార్పొరేటర్లు, నాయకులు ఎమ్మార్వోలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు