రబీకి సంబంధించి రైస్ మిల్లర్ల తో సమీక్ష సమావేశం
-కలెక్టర్ జితేష్ వి పాటిల్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి , మార్చ్ 11 ( లోకంతీరు ) : 2022- 23 రబీకి సంబంధించిన ధాన్యాన్ని బిడ్డర్లకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా అప్పగించవలసిందిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రైస్ మిల్లర్లను కోరారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్ల తో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత రబీకి సంబంధించి ఒక లక్ష 61వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేలం వేసి బిడ్డ ర్లకు కేటాయించిందని అన్నారు. అట్టి రబీకి సంబంధించి జిల్లాలోని 85 రైస్ మిల్లర్లకు కేటాయించిన ధాన్యాన్ని ఎటువంటి ఇబ్బందులూ పెట్టకుండా బిడ్డర్లకు అప్పగించాలని కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి మల్లికార్జున బాబు, సహాయ పౌరసరఫరాల అధికారి నిత్యానందం, రైస్ మిల్లర్లు, తదితరులు పాల్గొన్నారు