పీఎం సూరజ్ పోర్టల్ ను వర్చువల్ విధానంలో ప్రారంభించిన నరేంద్ర మోదీ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి , మార్చ్ 13 ( లోకంతీరు ) : అనగారిణ వర్గాల కోసం ఔట్రిచ్ కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా పిఎం సూరజ్ పోర్టల్ ను బుధవారం సాయంత్రం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో ప్రొజెక్టర్ పై లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వ పథకాలను అవగాహన కల్పించారు. సామాజిక అభ్యున్నతి, ఆధారిత ప్రజాసంక్షేమం గురించి ప్రొజెక్టర్ ద్వారా మహిళలకు, ప్రజలకు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ పథకాల ద్వారా మహిళలు తీసుకున్న రుణాల గురించి వివరించారు. రుణాలు తీసుకొని ఆర్థికంగా ఎదిగిన మహిళలు తమ విజయ గాధలను తెలియజేశారు. మహిళలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. కార్యక్రమంలో ఎల్డీఎం సుదీర్ భార్గవ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి దయానంద్, జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి రజిత, అధికారులు పాల్గొన్నారు.