ప్రభుత్వ వైద్యశాల లో కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాల భర్తీ
-జిల్లా కలెక్టర్ జితేశ్వి పాటిల్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి , మార్చ్ 13 ( లోకంతీరు ) : కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలనందు ఒప్పంద ప్రాతిపదికన (కాంట్రాక్ట్) గౌరవ వేతనం పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ పి వెంకటేశ్వర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 9 ప్రొఫెసర్లు, 15 అసోసియేట్ ప్రొఫెసర్లు, 15 అసిస్టెంట్ ప్రొఫెసర్లు,.15 సీనియర్ రెసిడెంట్స్ పోస్టుల కొరకు
ఈ నెల 15 న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రభుత్వ వైద్య కళాశాల నందు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు మార్చి 31, 2025 వరకు వైద్య విద్య సంచాలకులా పరిధిలో పనిచేసే కామారెడ్డి ప్రభుత్వ ;వైద్య కళాశాల, జిల్లా ప్రధాన ఆసుపత్రి నందు పనిచేయవలసి ఉంటుందని ఆయన తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 15 న జరిగే ఇంటర్వ్యూ కు విద్యార్హతలు, కుల,నివాస ధ్రువీకరణ, ఇతర ధ్రువీకరణ పత్రాలు, ఒరిజినల్ సర్టిఫికెట్లతొ హాజరు కావాలని, ఇతర వివరాలు, హనరోరియం కొరకుwww.gmc.kamareddy.in వెబ్ సైట్ ను సంప్రదించవలసినదిగా వెంకటేశ్వర్ రావు తెలిపారు.