Take a fresh look at your lifestyle.

అమ్మ పేరుతో ఒక మొక్కను నాటండి.

0 1,592

అమ్మ పేరుతో ఒక మొక్కను నాటండి….

  • మండలాధ్యక్షులు ప్రకాష్ పటేల్.

బాన్సువాడ/కోటగిరి, జూలై 06 ( లోకంతీరు) :  అమ్మ పేరుతో ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలని పోతంగల్ మండల బిజెపి పార్టీ అధ్యక్షులు ప్రకాష్ పటేల్ కోరారు. శనివారం పోతంగల్ మండల కేంద్రంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ జన్మదినం పురస్కరించుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు అమ్మ పేరుతో ఒక మొక్క అనే కార్యక్రమాన్ని మండల బిజెపి పార్టీ ఆద్వర్యంలో ప్రారంభించి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ప్రపంచంలో మానవాళ్ళికి ఆక్సిజన్ అత్యంత అవసరం.నేడు ఆ ఆక్సిజన్ కలుషితమైపోతుందన్నారు. కావున ప్రతి ఒక్కరు దేశ ప్రధాని మోడీ పిలుపుమేరకు మాతృమూర్తులు తమ బిడ్డలను ఎలా సంరక్షించుకుంటారో అలానే ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటి మాతృమూర్తివలె మొక్కలను సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబిసి మోర్చా నాయకులు మక్కయ్య, బాన్సువాడ అసెంబ్లీ కన్వీనర్ గురుగుట్ల శ్రీనివాస్,పోతంగల్ సొసైటీ చైర్మన్ శాంతిశ్వర్ పటేల్, బిజెపి నాయకులు మక్కయ్య, దిగంబర పటేల్,హరి పటేల్, సురేష్,కిరణ్ సేట్,గణేష్ పటేల్, నాగనాథ్ పటేల్,లక్ష్మణ్ శ్రీకాంత్, బస్వంత్, అశోక్,గంగుబాయ్, నైముద్దీన్,గంగాధర్,ఏం.శంకర్, రమేష్,పవన్,సాయిలు,సునీల్,రాజు,వినోద్,గిరిధర్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.