Take a fresh look at your lifestyle.

లోకం తీరు వార్త కథనానికి స్పందన..!

0 1,690

లోకం తీరు వార్త కథనానికి స్పందన..!

కామారెడ్డి జిల్లా / బిచ్కుంద , జూలై 06 ( లోకంతీరు ) : 

మంజీరా ను తెగ తోడేస్తున్నారు ఇసుక సురులు..?

అనే వార్త “లోకం తీరు” పత్రికలో శనివారం ప్రచురణ జరిగిన విషయాన్ని గమనించిన తాసిల్దార్ లత రెండు లారీలను సీజ్ చేసి జరిమానావిధించినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వా నిబంధనల మేరకు వే బీల్లులు కచ్చితంగా ఉండాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు ఇసుకను ప్రభుత్వ నియమ నిబంధనకు కట్టుబడి ప్రజలకు ప్రకృతికి ఇబ్బంది కాకుండా, ప్రభుత్వ అనుమతితో ఇసుకను తరలించుకోవాలని కోరారు. అదేవిధంగా గతంలో రోజుకు వందల సంఖ్యలో లారీలు తరలిస్తుంటే చూస్తూ ఉన్న జనాలు ఒకసారిగా తిరగబడే స్థాయికి వచ్చి కొన్నిచోట్ల పలు గ్రామాలలో లారీలను నిలిపివేశారు. తదుపరి ఇలాంటి చర్యలు చేపడితే కచ్చితంగా అడ్డుకుంటామని ఇసుక మాఫియా గుత్తేదారులను, గ్రామస్తులు నిలదీశారు. ఒకే రోజు వందల సంఖ్యలో లారీలు తరలిస్తుంటే
ప్రస్తుతం రెండు లారీలను మాత్రమే పట్టుకుని సీజ్ చేయడంపై ఆంతర్యమేమని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సర్వత్ర అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
అదేవిధంగా ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా తవ్వుతున్న క్వారీల గుత్తేదారులపై కఠిన చర్యలు తీసుకొని భారీ బందోబస్తు కేటాయించి ప్రకృతిని కాపాడాలని ప్రజలు విశ్వసిస్తున్నారు. అదేవిధంగా
వే బిల్లులు ఉన్న వాటికి సమయపాలనలో ఆలస్యం ఎందుకు..? అక్రమ ఇసుక రవాణా దారులు క్వారీలలో వే బిల్లులతో వచ్చే లారీలను ఒకటి, రెండు రోజులు ఆపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దానికి తోడు జీరో వే బిల్లులతో భారీగా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా ఇసుక అక్రమ రవాణాపై అధికారులు దృష్టిసారించాలని స్థానికులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.