Take a fresh look at your lifestyle.

పట్టణ కేంద్రంలో బాబు జగ్జీవన్ రాం వర్ధంతి 

0 1,210

పట్టణ కేంద్రంలో బాబు జగ్జీవన్ రాం వర్ధంతి 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, జులై 06 ( లోకంతీరు ) : కామారెడ్డి పట్టణ కేంద్రంలోని హరిజనవాడలో శనివారం 6 జూలై 2024 రోజున బాబు జగ్జీవన్ రాం దేశ ఉప ప్రధానమంత్రి 38 వ వర్ధంతి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బాబు జగ్జీవన్ రావ్ అణగారిన వర్గాల కులాలకు ఎన్నో సేవలు అందించిన గొప్ప వ్యక్తి, అటువంటి మహానీయుని ఆత్మకు శాంతి చేకూరాలని మాదిగ రాజకీయ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ ఘన నివాళి అర్పించారు. కామారెడ్డి జిల్లాలో వర్ధంతిలు, జయంతులు అన్ని వర్గాల కులాల ఆశాజ్యోతి జయంతులు జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రాం ఎంతో దళిత బహుజన వర్గాలకు కృషి చేసిన జాతిపితలు అని ప్రతి ఒక్కరు మర్చిపోవద్దని మాదిగ రాజకీయ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్ కాలనీ, హరిజనవాడ, పోచమ్మ గుడి వాడలో ఆయనకు పెద్ద ఎత్తున ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చిట్యాల సాయన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు బాగయ్య మాదిగ బాబు జగ్జీవన్ రావు వర్ధంతి పూలమాల చేసి ఘన నివాళి అర్పించారు. ఇందులో ఎమ్మార్పీఎస్ నాయకులు, మహిళలు, కొత్తూరి బూదయ్య, దయానంద్, కోటి అశోక్, కొత్తూరు గంగయ్య, ఎల్లయ్య, కృష్ణ, మధు, రంజిత్, నరసవ్వ, జమీల, భారతి, నరసవ్వ, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.