రైతుల కు టోకరా 19 కోట్ల 30 లక్షలు గాయత్రి యాజమాన్యం.?
— తీసుకున్న గాయత్రి ఫ్యాక్టరీ యాజమాన్యం..!
— గాయత్రి రైతులకు రుణమాఫీ వర్తిస్తుంది
— ఆందోళన అవసరం లేదు
— గాయత్రి యజమాన్యం
కామారెడ్డి జిల్లా, జులై 24 ( లోకంతీరు ) : 2600 మంది రైతుల పేరిట రూ. 19 కోట్లు 30 లక్షలు బ్యాంక్ రుణాలు తీసుకున్న గాయత్రీ యాజమాన్యం
-2003-2004 నుండి రైతుల పెరిట రుణాలు తీసుకుని చెల్లిస్తున్న గాయత్రీ ఫ్యాక్టరీ
రైతులకు సర్కార్ రుణామాఫీ చేయడంతో రైతుల ఫోన్లకు మెసేజ్లు 10 రోజులలో రైతుల మాపీ డబ్బులను చెల్లిస్తాం
రైతులుఆందోళన చెందవద్దు..! మాఫీ రుణాల డబ్బులను రైతులకు చెక్కుల
ద్వార అందజేస్తాం.వైస్ ప్రసిడెంట్ వేణుగోపాల్రావు సదాశివనగర్, రైతుల పెరిట గాయత్రీ షుగర్స్ ఫ్యాక్టరీ యాజమాన్యం
2003-2004 సంవత్సరం నుండి నిజామాబాద్ పట్టణంలోని నాందేవ్వాడ యూనియన్ బ్యాంక్ నుండి టాయప్ కింద సూరిటి పై 2600 మంది రైతుల పెరిట రూ. 19కోట 30 లక్షల వరకు రుణాలు తీసుకుని ప్రతీ సంవత్సరం పెరిట రూ.19కోట్ల 30 లక్షల వరకు రుణాలు తీసుకుని ప్రతి సంవత్సరం చేల్లిస్తుందని గాయత్రీ షుగర్స్ ఫ్యాక్టరీ డీజీఎం మురళీ, ప్రసిడెంట్ శంకర్, వైస్ ప్రసిడెంట్ వేణుగోపాల్ రావు లు అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి శివార్లోగల గాయత్రీ షుగర్స్ ఫ్యాక్టరీలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైస్ ప్రసిడెంట్ వేణుగోపాల్రావు మాట్లాడుతూ రైతుల పెరటి తీసుకున్న రుణాలను ప్రతీ సంవత్సరం బ్యాంక్ లో కట్టి రినివల్ చేస్తున్నట్లు తెలిపారు. సర్కార్ రుణామాఫీ చేసిన సందర్భంగా రైతుల డబ్బులను గాయత్రీ యాజమాన్యం చెక్కుల ద్వార అందిస్తామన్నారు. రైతుల డబ్బులను బ్యాంక్ ద్వార తీసుకుని అట్టి డబ్బులను కూలీల అడ్వాన్సుగా, ఎరువులు, విత్తనాలు
కోసం వాడుతమన్నారు. అట్టి డబ్బులను ప్రతీ సంవత్సరం రినివల్ చేస్తున్నట్ల తెలిపారు. గతంలో రుణాలు మాపీ కాలేదన్నారు. ప్రస్తుతం మాఫీ కావడంతో అట్టి డబ్బులను రైతులకు చెక్ రూపంలో అందిస్తామన్నారు. రైతుల పెరిట రుణాలు తీసుకుని వారికోసం వినియోగిస్తున్నట్లు తెలిపారు. రైతుల కోసం గాయత్రీ షుగర్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశామన్నారు. రైతులను ఎప్పటికి మోసం చేయలేదన్నారు. రైతుల సహకారంతోను ఫ్యాక్టరీ నడుస్తుందన్నారు. కేన్ డేవలప్మెంట్ కోసం రైతుల నుండి సంతకాలు తీసుకుని రుణాలు తీసుకున్నట్లు తెలిపారు. రైతులకు తెలువకుండ రుణాలు తీసుకోలేదన్నారు. బ్యాంక్ లో ఇప్పటి వరకు రూ.45 లక్షల చెల్లించినట్లు తెలిపారు. 10 రోజులలో బ్యాంక్ రుణాలను చెల్లిస్తామన్నారు. రుణామాపీ డబ్బులను ఖాతలలో లేదా చెక్కుల ద్వార అందిస్తా మన్నారు. రైతుల ఆందోళన చెందవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో గాయత్రీ ఫ్యాక్టరీ పీవో వెంకటేశ్వర్లు, కేన్ డిపార్ట్మెంట్ ఏవోలు, ఫీల్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

