Take a fresh look at your lifestyle.

చెరుకు రైతులకు రుణమాఫీ ఇచ్చేస్తాం సరే..! జాప్యానికి పరిష్కారం ఏమిటి..?

0 1,474

చెరుకు రైతులకు రుణమాఫీ ఇచ్చేస్తాం సరే..! జాప్యానికి పరిష్కారం ఏమిటి..?

— గత 20 సంవత్సరాలు నుండి రుణమాఫీ ఎన్నిసార్లు మాఫీ వర్తించింది
— గత 20 సంవత్సరాలుగా బ్యాంకులో రైతుల తరఫున రుణాలు..?
— రైతులకు తెలియకుండానే తీసుకున్నందుకు పరిహారం.?
— 2002 నుండి 2024 వరకు రైతులు ఎంత మోసపోయారు
— రైతులకు తెలియని నష్టానికి పరిహారం చెల్లింపు ఎంత..?
— ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన పై స్పందన
— చెరుకు రైతులకు న్యాయం జరగాలి
— జిల్లా వ్యవసాయ అధికారి కి వినతి పత్రం అందజేత
— బారసా నాయకుల డిమాండ్

కామారెడ్డి జిల్లా, జూలై 25  ( లోకంతీరు )కామారెడ్డి జిల్లా ఉమ్మడి రామారెడ్డి, సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో ఇటీవల జరిగిన రైతు రుణాల గోల్మల్ సంఘట 2002 నుండి 2024 వరకు రైతుల పై గాయత్రి ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల (దస్తావేజులను) పాస్ పుస్తకాలతో పాటు ఎరువుల పేరిట, చెరుకు విత్తనం ఇవ్వడానికి, చెరుకు తరలింపుకు, చెరుకు యొక్క సమగ్ర సమాచారాన్ని సేకరించడానికి గతంలో రైతుల వద్ద నుండి పాస్ పుస్తకాలను జిరాక్స్ కాపీలను తీసుకున్నారు. ఏమీ తెలియని రైతులు చెరుకు ఫ్యాక్టరీ యాజమాన్యం ఫీల్డ్ మెన్ అసిస్టెంట్ ద్వారా అడిగిన పేపర్లను ఇచ్చారు. ఆ తర్వాత ఫీల్డ్ మెన్ సిబ్బందిని కొద్దికొద్దిగా తగ్గించారు. తదుపరి పాత పంట పాస్ పుస్తకాల పై రైతులు మర్చిపోయారు. తదుపరి ధరణి పుణ్యమా వారికి కొత్త పాస్ పుస్తకాలు రావడంతో సంతోషపడ్డారు. ఇదే అదులుగా ఇటీవల కాలంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పంట రుణమాఫీ పథకం ద్వారా మొదటి విడతగా లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా రైతులకు మెసేజ్ కూడా పంపారు. బ్యాంకులలో అర్హులైన రైతులకు అమౌంట్ కూడా జమ చేయడం జరిగింది. అదేవిధంగా గాయత్రి ఫ్యాక్టరీకి సంబంధించిన రైతులకు కూడా రుణమాఫీ మెసేజ్లు రావడం జరిగిందని వాపోయారు..? ఇది ఎలా సాధ్యం మేము లోను తీసుకోలేదు అలాంటప్పుడు మాకు మెసేజ్ ఎలా వస్తాయి అని అనుమానం మొదలుకొని తీరా గాయత్రి ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని గట్టిగా అడగడం ద్వారా వాళ్లు ఉన్నది ఉన్నట్టుగా అవును వాస్తవమే రైతుల పేరిట 2002 నుండి 2024 వరకు సుమారు 19 కోట్ల 40లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ అయ్యాయని అవి అలానే ఉన్నాయి. రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదు రైతులకు నేరుగా చెక్కుల రూపేనా అందచేయడం జరుగుతుందని ఆ సంస్థ యాజమాన్యం బుధవారం తెలిపింది. ఇంతవరకు వాస్తవమే అయితే ఇన్ని రోజులు రైతుల యొక్క రుణమాఫీ కి సంబంధించి పూర్తి సమగ్ర సమాచారం సేకరించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని, అదేవిధంగా గత ప్రభుత్వం కూడా రుణమాఫీని వర్తింపజేసింది.

ఆ డబ్బులు ఎక్కడికి వెళ్లాయి…?

గత తెలంగాణ ప్రభుత్వం రెండు దఫాలుగా రుణమాఫీని రైతులకు వర్తింపజేసింది. ఇట్టి విషయంలో ఈ యొక్క చెరుకు రైతులకు సంబంధించిన రుణమాఫీ వర్తించిందా లేదా? ఫ్యాక్టరీ యాజమాన్యం పూర్తిగా స్పందించి రైతులకు న్యాయం చేయవలసిందిగా రైతుల తరఫున బిఆర్ఎస్ నాయకులు గట్టిగా రైతు పక్షాన నిలబడి నిడదీసిన ఘనత.
పూర్తిస్థాయి విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బారాస నాయకులు జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి కి వినతి పత్రం అందజేశారు. గాయత్రి యజమాని రైతుల పేరిట బ్యాంకులో రుణాలు తీసుకొని వారికి తెలియకుండా మోసం చేశారని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రుణాలు మాఫీ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చిందని వారు ఆరోపించారు.కలెక్టర్ సూచన మేరకే విచారణ అధికారిగా మీరు నందున వినతి పత్రం అందజేస్తున్నామని వారు పేర్కొన్నారు. గతంలో కెసిఆర్ ప్రభుత్వం రెండుసార్లు రుణమాఫీ చేశారని అప్పుడు కూడా రైతుల పేరిట రుణాలు మాఫీ అయ్యాయా అనే విషయం పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.పూర్తి విచారణ జరిపిన తర్వాత ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకొని రైతులకు మేలు చేయాలని విజ్ఞప్తి చేశారు.వ్యవసాయ అధికారిని కలిసిన వారిలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సదా శివనగర్ ఉమ్మడి మండల మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు, రామారెడ్డి మాజీ ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డ,ఉప్పల్ వాయి మాజీ సర్పంచ్ గంగారాం,రామారెడ్డి మండల యూత్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, కుప్రియాల్ మాజీ ఉపసర్పంచ్ కలాలి సాయ గౌడ్ సీనియర్ నాయకులు పోతుల లింగారెడ్డి, లింబాద్రి నాయక్, జంగం లింగం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.