Take a fresh look at your lifestyle.

వికలాంగులపై చేసిన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి….

0 1,184

వికలాంగులపై చేసిన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

కామారెడ్డి , జూలై 25 ( లోకంతీరు )వికలాంగులపై అనుచిత వాఖ్యలు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితాసబర్వాల్ తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలని రాజంపేట మండల వికలాంగుల హక్కుల పోరాట సమితీ నాయకులు గజ్జెల రాజు గురువారం పత్రిక ప్రకటనలో డిమాండ్ చేశారు. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో దివ్వాంగులకు రిజర్వేషన్లు ఎందుకు అంటు ఆమె చేసిన వాఖ్యలు సరి కాదని ఓ సీనియర్ అధికారి దివ్వాంగులపై మాట్లాడడం సిగ్గుచేటన్నారు. వికలాంగులకు దైర్యం నింపాల్సిన అధికారి అనుచిత వాఖ్యలు చేయడం సరికాదని, వభుత్వం వికలాంగులకు ఎంతో అండగా ఉందని ప్రభుత్వంలో పని చేస్తున్న అధికారులు దివ్యాంగులపై చేస్తున్న వాఖ్యలు సరికావని డిప్యూటి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, మాజీ మంత్రులు సబర్వాల్ మాటలను తప్పు పట్టారని అయిన మళ్ళీ స్వరం వణుకుతూ, నిజమే మాట్లాడండి అంటు మరోసారి చేసిన వెంటనే వాఖ్యలు వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. లేనిపక్షంలో వికలాంగుల సంఘం అద్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.