సిజనల్ వ్యాధులు పట్ల అవగాహన

బాల్కొండ నియోజకవర్గ ప్రతినిధి, జులై 27 ( లోకంతీరు) : బాల్కొండ మండల కేంద్రంలో సీజన్లో వచ్చే డెంగ్యూ మలేరియా చికెన్ గునియా డయేరియా వ్యాధుల పట్ల బాల్కొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మరియు కేజీబీవీ స్కూల్ మరియు కాలేజీ మరియు ఎం జె పి టి వి బి ఈ స్కూల్ లో శనివారం డాక్టర్ స్రవంతి అవగాహన సదస్సును నిర్వహించారు. స్కూల్స్ కాలేజీలో కలియ తిరుగుతూ వంట గదులు ఎలా ఉన్నాయి పరిశీలించారు. పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు విద్యార్థులు తప్పనిసరిగా శుభ్రత పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ మురళి హెల్త్ సూపర్వైజర్ వాణి హెల్త్ అసిస్టెంట్ రాజు ఆశ వర్కర్ మాధురి పాల్గొన్నారు.