Take a fresh look at your lifestyle.

తల్లి పాల వారోత్సవాలు….

0 1,251

తల్లి పాల వారోత్సవాలు

కామారెడ్డి ప్రతినిధి ,ఆగస్టు 02(లోకంతీరు) : రామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి పరిదిలో ని కన్నాపూర్ తండాలో శుక్రవారం అమ్మ పాల  వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. వైద్యాధికారి డా.సురేష్ కన్నపూర్ తండా గ్రామాన్ని దర్శించి తల్లి పాల వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొని తల్లి పాల ప్రాముఖ్యత గురించి వివరించారు.అలాగే సీజనల్ వ్యాధుల గురించి పరిసరాల పరిశుభ్రత గురించి వ్యక్తి గత పరిశుభ్రత గురించి కూడా వివరించడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథి గా రామారెడ్డి వైద్యాధికారి డా.సురేష్ పాల్గొన్నారు. వైద్యాధికారి మాట్లాడుతూ అమ్మ యొక్క ముర్రి పాలు బిడ్డ పుట్టగానే అర గంటకు తప్పకుండా తాగించాలి తగించడం వలన పిల్లలకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది పిల్లలు అన్ని వ్యాదులను తట్టుకునే శక్తి ఆ పాల నుండి వస్తుంది. అని గర్భిణీ స్త్రీలకు , పిల్ల తల్లులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సంజు జార్జ్, ఏఎన్ఎం జ్యోతి, ఆశ వర్కర్లు ,కన్నపూర్ తండా గర్భిణులు, పిల్ల తల్లులు, గ్రామస్తులు, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.