Take a fresh look at your lifestyle.

తప్పుడు పత్రాలు సృష్టించి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తుల అరెస్ట్…..

0 1,143

తప్పుడు పత్రాలు సృష్టించి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తుల అరెస్ట్

— బ్రతికి ఉన్న వ్యక్తిని, చనిపోయినట్లుగా తప్పుడు పత్రాలు..!
— ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తుల అరెస్ట్…!
— పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి

కామారెడ్డి ప్రతినిధి ,ఆగస్టు 2 (లోకంతీరు) : కామారెడ్డి జిల్లాలో బ్రతికి ఉన్న వ్యక్తిని, చనిపోయినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తుల అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.నరాల జీవన్ రెడ్డి, అశోక్ నగర్ కాలనీ, కామారెడ్డి లో నివాసం ఉండే ఇతనికి అశోక్ నగర్లో 200 గజాల ప్లాటు ను తేది 26/07/2024 నాడు కామారెడ్డి పట్టణానికి చెందిన మహమ్మద్ సాజిద్ హుస్సేన్, వ్యక్తి ట్రాక్టర్ సహాయంతో చదును చేయడానికి తీసుకురాగా, ఆ విషయం తెలిసిన జీవన్ రెడ్డి వెంటనే అక్కడికి వెళ్లి, ఎవరు నువ్వు, నా ప్లాట్ ఎందుకు చదును చేస్తున్నావ్ అని అడిగినందుకు, తాను ఈ ప్లాటును వేరే వాళ్లకు అమ్మడం కోసము చదును చేస్తున్నాను, ఈ ప్లాటు నిజామాబాద్ కి చెందిన అబ్దుల్ మోసి అనే వ్యక్తి కొనుగోలు చేసినట్లుగా కొన్ని పత్రాలను చూపించగా, ఆ పత్రాలను చూసిన జీవన్ రెడ్డి, దానిలో జీవన్ రెడ్డి అనే వ్యక్తి 2012 లోనే చనిపోయినట్లుగా ఒక డెత్ సర్టిఫికేట్ నీ, జీవన్ రెడ్డి కూతురుగా బగ్గాలి స్రవంతి అనే తీసుకువచ్చి ఒక సెల్ఫ్ అఫిడవిట్ క్రియేట్ చేసి, కామారెడ్డి సబ్ రిజిస్టర్ ఆఫీసులో మహమ్మద్ అబ్దుల్ మోసి పేరుమీద రిజిస్టర్డ్ సేల్ డీడ్ చేశారన్నారు. జీవన్ రెడ్డి తనని మోసం చేస్తూ, తాను చనిపోయినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించి, తన కూతురి ప్లేస్ లో వేరొక నీ పెట్టి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసినారని కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
అయితే విచారణలో అబ్దుల్ మోసి వ్యక్తి, అతనితో పాటుగా నిజామాబాదులో డాక్యుమెంట్ రైటర్ గా చేస్తున్న షేక్ అహ్మద్ నబీ, షకీల్ ఫెరోజ్, ఖాజా అబ్బాస్ మహమ్మద్ ఉస్మాన్ కలిసి నరాల జీవన్ రెడ్డి యొక్క ప్లాటును మోసపూరితంగా, అతను చనిపోయినట్లుగా వేరే వారి యొక్క డెత్ సర్టిఫికేట్ ను మార్చివేసి, అహ్మద్ నబీకి పరిచయమున్న బగ్గాలి స్రవంతిని నరాల జీవన్ రెడ్డి కూతురుగా తీసుకువచ్చి, సబ్ రిజిస్టార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేశారన్నారు.భూమిని వేరే వాళ్లకు అమ్మడం కోసము చదును చేయడానికి కామారెడ్డికి చెందిన సాజీద్ హుస్సేన్ సహాయంతో చదును చేస్తున్నడంతో కేసు నమోదు చేస్తామని తెలిపారు. విచారణ చేసి, బాధ్యులైన మహమ్మద్ అబ్దుల్ మోసి, బాగ్గాలి స్రవంతి, షేఖ్ అహ్మద్ నబీ లను అరెస్టు చేసి జైలుకు పంపామన్నారు. పరారీలో ఉన్న మిగతా వారిని పట్టుకుని పట్టుకుంటామన్నారు.

Leave A Reply

Your email address will not be published.