తమ సొసైటీ పై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నాం
– మాల్ తుమ్మెద సొసైటీ చైర్మన్

కామారెడ్డి జిల్లా, ఆగస్టు 20 (లోకంతీరు) : జిల్లాలోని నాగిరెడ్డి పేట మండలం మాల్ తుమ్మెద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సొసైటీ అధికారులు ఎరువు బస్తాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని శనివారం పలు పత్రికల్లో వచ్చిన వార్త కథనాన్ని తాము ఖండిస్తున్నామని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు దుందిగళ్ళ నరసింహులు, పాలకవర్గ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. తమ సొసైటీలో ఐపీఎల్ పొటాష్ 50 కేజీల బస్తాలు 1600 విక్రయిస్తున్నారని చేసిన ఆరోపణలు నిజం లేదని, పొటాష్ బస్తాపై అదనంగా 35 రూపాయలు తీసుకుంటున్నట్లు వచ్చిన వార్త అవాస్తవం అని అన్నారు. ఎమ్మార్పీ రేటుకు తక్కువగానే అమ్మకాలు చేపడుతున్నామని సొసైటీ చైర్మన్ నర్సింలు అన్నారు. రైతు కొనుగోలు చేసిన ప్రతి బస్తాకు తాము రసీదులు అందజేస్తున్నామన్నారు. ఇందులో వచ్చినటువంటి లాభాలు సొసైటీలోని ప్రతి రైతుకు చెందుతాయన్నారు. సొసైటీ లో ఎలాంటి చేతివాటం లేదని, సహకార సంఘంలో ఎరువుల బస్తాలు పురుగు మందులు సాధారణ ధరలకు మాత్రమే విక్రయిస్తున్నామని వారు తెలిపారు. సొసైటీ కి వచ్చే ప్రతి రైతు తమ సభ్యుడే నని తాము గౌరవంగా వారితో లావాదేవీలు జరుపుతామని ఎవరితో దురుసుగా ప్రవర్తించ లేదన్నారు. కావాలనే కొందరు తమపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలోసొసైటీ చైర్మన్ దుందిగళ్ల నర్సింలు,ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.