అసెంబ్లీలో బిసి సమగ్ర కులగణన తీర్మానాన్ని స్వాగతిస్తున్నాం.
-
డబుల్ బెడ్ రూమ్ లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.
-
సిపిఐ నియోజకవర్గ ఇంచార్జీ దుబాస్ రాములు.

కోటగిరి , ఫిబ్రవరి 20 ( లోకంతీరు ) : ఇటీవల అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిసి సమగ్ర కులగణన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడాన్ని సిపిఐ పార్టీగా స్వాగతిస్తున్నామని బాన్సువాడ నియోజక వర్గ సిపిఐ పార్టీ ఇంచార్జీ దుబాస్ రాములు అన్నారు.బుధవారం కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ అధ్యక్షతన సిపిఐ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశాన్ని ఉద్దేశించి సిపిఐ పార్టీ బాన్సువాడ నియోజకవర్గం ఇంచార్జ్ దుబాస్ రాములు,సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ.గత ప్రభుత్వ హయాంలో కులగణన సర్వే గురించి అసెంబ్లీలో తీర్మానం చేయడంలో కెసిఆర్ విఫలమ య్యారని.దేశంలో,రాష్ట్రంలో అధిక జనాభా ఉన్నటువంటి బీసీ కులాలకు అన్ని రంగాల్లో నష్టం వాటిల్లుతున్నదని.బిసి, ఇతర కులాల ప్రాతిపదిక పైన రిజర్వేషన్ ఉండాల్సిన అవసరం ఉందన్నారు.కేవలం ఒకటి,రెండు కులాల వారు మాత్రమే మెజార్టీ ప్రజలున్న వారిపై పెత్తనం చేస్తున్నారని ధ్వజమెత్తారు.కేంద్ర ప్రభుత్వం కుల గణన చేపట్టాల్సిన అవసరం ఉందని.ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.బాన్సువాడ నియోజక వర్గంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో నిర్మించిన రెండు గదుల ఇండ్ల నిర్మాణంలో జరిగిన అవినీతిపై ప్రస్తుత ప్రజాపాలన ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ లు నిర్మిం చుకున్న వారందరికీ పెండింగ్లో ఉన్నటువంటి నిధులు వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కోరారు. అలాగే డబుల్ బెడ్ రూమ్ లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని,డబుల్ బెడ్ రూమ్ పేరుతో నిరుపేదలను నిండా ముంచారని వారు ఆవేదనను వ్యక్తం చేశారు. నియోజక వర్గంలో 3000 ఇండ్లను మాత్రమే కాంట్రాక్టర్లు నిర్మించారని.ఈ ఇండ్లు కూడా నాసిరకంగా నిర్మించారని వారు పేర్కొన్నారు.మిగతా ఎనిమిది వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ను సొంత స్థలంలో లబ్ధిదారు లే 10 నుండి 12 లక్ష రూపాయ లు ఖర్చు చేసి ఇండ్లు నిర్మించు కున్నారని.వీరికి ఐదు దఫాల లో చెల్లించాల్సిన బిల్లులు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు చెల్లించి మిగతా డబ్బులు సర్పంచులు, కాంట్రాక్టులు పంచుకున్నారని వారు విమర్శించారు.దీనిపై పూర్తి స్థాయిలో న్యాయవిచా రణ జరిపించి కారకులపైన కఠిన చర్యలు తీసుకొని పేదలకు ప్రస్తుత ప్రభుత్వం న్యాయం చేయాలని వారు కోరారు.ఈ సమావేశంలో సిపిఐ జిల్లా నాయకులు వై.ఓమయ్య,సిపిఐ మండల నాయకులు నల్ల గంగాధర్, సోమ రాములు,శివరాజ్, హనుమన్లు,గూడు,గిర్మవ్వ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.