Take a fresh look at your lifestyle.

నేడు రైతు ధర్నాను విజయవంతం చేయాలి…

0 1,083

నేడు రైతు ధర్నాను విజయవంతం చేయాలి

– బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జలెందర్ రెడ్డి

ఎల్లారెడ్డి,ఆగస్టు 21(లోకంతీరు) : రైతు రుణమాఫీలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నేడు బిఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎల్లారెడ్డి బీఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జలెందర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించే ధర్నా కార్యక్రమంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు తదితరులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులకు రుణమాఫీ అయ్యేవరకు కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి వంద శాతం రుణమాఫీ చేయిస్తామని చేసేంతవరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Leave A Reply

Your email address will not be published.