రెండు లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి

కామారెడ్డి జిల్లా/ బీబీపేట, ఆగస్టు 22 (లోకంతీరు): జిల్లాలోని బీబీపేట్ మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి మాఫీ చేయకుండా మూడు విడుతలుగా రెండు లక్షల రూపాయలను ప్రభుత్వం రుణమాఫీ చేయడం లేదని జిల్లా మాజీ వైస్ ఛైర్మన్ ప్రేమ్ కుమార్ రోడ్డుపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమందికి మాత్రమే రుణమాఫీ అయిందని, ప్రతి ఒక్కరికీ రుణమాఫీ చేయాలని అన్నారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు పంటల సమయానికి వేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు రైతుబంధు ఇవ్వకపోవడం రైతులకు బాధాకరమంటూ ధర్నా చేపట్టారు. ఇట్టి కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాలమణి, టిఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.