బిచ్కుంద కస్తూరిబా పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్

కామారెడ్డి జిల్లా, ఆగస్టు 23 (లోకంతీరు) : బిచ్కుంద కేంద్రంలో కస్తూరిబా పాఠశాలలో జరిగిన అమ్మ ఆదర్శ పాఠశాల మరమత్తు పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. విద్యార్థులు తాగునీటి సౌకర్యాలతో ఏర్పాటు చేసిన కుళాయిలను పరిశీలించారు. వంటగది, విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికారాన్ని పరిశీలించారు. పాఠశాల పరిసరాలను సందర్శించి, పాఠశాల ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. నాటిన మొక్కలను సంరక్షించవలసిన బాధ్యత విద్యార్థులపై ఉందని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి రెండు మొక్కలను దత్తత తీసుకొని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాజు, డిపిఓ శ్రీనివాసరావు, ఎంపీడీవో గోపాల్, ఎంపీవో అబ్బ గౌడ్, ప్రిన్సిపల్ రాగిణి, అధికారులు పాల్గొన్నారు.