ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో 35 కోట్లతో అమృత్ 2.0 స్కీం ద్వారా నీటి సరఫరా

కామారెడ్డి జిల్లా , ఆగస్టు 27 ( లోకంతీరు ) : అమృత్ స్కీం ద్వారా మున్సిపాలిటీ పరిధిలో నీటి అవసరాలకోసం 4 ఈ ఎల్ ఎస్ ఆర్ వాటర్ ట్యాంక్ లతో 47కిలో మీటర్ల పైప్ లైన్ తో ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇవ్వబోతున్నామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. మన ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి అత్యధికంగా నిధులు కేటాయించామన్నారు. మినీ ట్యాంక్ బండ్, పార్క్, డబల్ బెడ్ రూం ఇండ్లు, సీసీ రోడ్లు, డెనేజీ పనులు చేస్తున్నామని తెలిపారు.నేడు మనం శంకుస్థాపన చేసుకుంటున్న ఈ అమృత్ స్కీంతో మున్సిపల్ ప్రజలకు స్వచ్ఛమైన తాగునిటీని అందిస్తామన్నారు.పట్టణంలోని పెద్ద చెరువు కట్టపై ఏర్పాటు చేస్తున్న మినీ ట్యాంక్ బండ్ ప్రాంతంలో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యుల విగ్రహాలను పెట్టి వారిని గౌరవిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, మెగా కంపెనీ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.