ప్రతి గ్రామాలలో సభ్యత్వ నమోదు చేపట్టాలి

ఎల్లారెడ్డి, ఆగస్టు 31 ( లోకంతీరు ) : ఎల్లారెడ్డి మండలంలోని ప్రతి గ్రామాలలో బిజెపి సభ్యత నమోదు 2024 చేపట్టాలని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్రావు అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణంలో బిజెపి సభ్యత నమోదు 2024 బిజెపి పార్టీ మండల అధ్యక్షులు నర్సింలు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్ రావు మాట్లాడుతూ సంస్థ గతంగా నిర్మించడానికి పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ పిలుపు మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అత్యధిక సంఖ్యలో సభ్యత్వ నమోదు చేయాలని కార్యకర్తలకు కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయినటువంటి బిజెపిని మరొకసారి అత్యధిక సభ్యత నమోదు చేసి పార్టీని బూత్ స్థాయిలో నిర్మాణం చేపట్టాలని, కార్యకర్తలు యువకులు సాధన క్రియాశీలక సభ్యత నమోదులో ఆలు పెరగా సైనికుల వలె పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు నర్సింలు మాట్లాడుతూ పార్టీ ప్రతి గ్రామంలో పార్టీ సభ్యత నమోదు చేపడతామని, సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరపడంతో పాటు భారత ప్రధాని పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుతామన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మర్రి బాలకిషన్, బిజెపి పార్టీ మండల అధ్యక్షులు నర్సింలు, మండల ప్రధాన కార్యదర్శి నరేష్, సీనియర్ నాయకులు సాయి రెడ్డి, నరసింహారెడ్డి,రాజు, సాయిలు,గణేష్, శ్రీనివాస్,అమర్నాథ్ వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.