Take a fresh look at your lifestyle.

శివాయిపల్లి గ్రామం వెళ్లే దారి మల్లింపు…..

0 1,274

శివాయిపల్లి గ్రామం వెళ్లే దారి మల్లింపు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి/ రాజంపేట ,సెప్టెంబర్ 01 ( లోకంతీరు ) : జిల్లాలోని రాజంపేట మండల కేంద్రం నుండి శివాయిపల్లి, తలమడ్ల, పొందుర్తి, ఆరేపల్లి గ్రామాలకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా వెళ్లాలని రాజంపేట ఎస్సై సూచించారు. శనివారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు రాజంపేట మండల కేంద్రం నుండి శివాయిపల్లి వెళ్లే దారిలో ఉన్న ఆర్యాల వాగు పొంగి పొర్లుతున్న కారణంగా రాజంపేట ఎస్సై పుష్ప రాజ్ సిబ్బంది గ్రామస్తులతో కలసి వాగు వైపు వెళ్లకుండా ఆదివారం దారికి అడ్డంగా ముళ్ళపొదలు వేయించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.