Take a fresh look at your lifestyle.

శిలాఫలకంపై దాతల పేర్లు పెట్టాలి….

0 1,529

శిలాఫలకంపై దాతల పేర్లు పెట్టాలి

కామారెడ్డి జిల్లా, అక్టోబర్ 15 ( లోకంతీరు ) : జిల్లాలోని మాచారెడ్డి ఎక్స్ రోడ్ లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సుమారు రెండు ఎకరాల భూమిని రావుల అంతయ్య వారి కుమారులు మరియు గంధం రాజ గోపాల్ వారి కుటుంబ సభ్యులు దేవాలయానికి విరాళంగా ఇచ్చారు. దేవాలయానికి ఇచ్చిన భూమి యజమానులు అయిన వారి పేర్లు శిలాఫలకం పై రాయించక పోవడం సిగ్గు చేటన్నారు. రెండు ఎకరాల భూమి విలువ సుమారు పది కోట్ల రూపాయల మేరకు ఉంటుందని దాతలు పేర్కొన్నారు. శిలా ఫలకంపై పేర్లు రాయించాలని, ఇరువురి కుటుంబాలకు ప్రత్యేక దర్శనం కల్పించాలని వారు కోరారు. లేని పక్షంలో కోర్టులో కేసు వేస్తామని వారు పత్రికా ముకంగా మంగళవారం తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.