జువెలరీ షాప్ లలో భారీ మోసాలు..?
— అరికట్టే అధికారులు తనిఖీలు శూన్యం..?
— జువెలరీ షాప్ ల ఆగడాలు అంతా ఇంతా కాదు?
కామారెడ్డి ప్రతినిధి, అక్టోబర్ 24 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా కేంద్రంలో పుట్టగొడుగుల వెలసిన జువెలరీ షాపులు, తనిఖీలు శూన్యం, పట్టించుకోని అధికార యంత్రాంగం, మోసపోతున్న ప్రజలు, జిల్లా కేంద్రంలో నడిబొడ్డులో ఉన్న షాప్ లలో ఈతంగం, అంతా ఇంతా కాదు ఏకంగా ఇతర జిల్లాలతో సంబంధాలు ఏర్పరచుకొని నకిలీ నాసిరకపు జువెలరీ వెండి బంగారు వస్తువులు అమ్ముతున్నారని సమాచారం.? వాస్తవ విషయం ఏమిటంటే ప్రజలు తమ యొక్క ఇంటి విలువేల్పుగా కొలిచే కొన్ని రకాల దేవతలకు కొన్ని ఆభరణాలను అలంకరించడం సాంప్రదాయబద్ధం ఇందులో భాగంగానే నకిలీ నాసిరకపు వస్తువులను,వెండివి అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్న కొంతమంది జువెలర్స్ యజమానులు,
కామారెడ్డి పట్టణంలోని జ్యువెలర్స్ షాప్లలో నరసింహస్వామి మీసాలు, నామాలు, ముస్లింలు అతి పవిత్రంగా పూజించే దర్గాకు సంబంధించిన గుర్రపు విగ్రహాలు, హిందువులు ఇంటి విలువలుగా కొలిచే అమ్మవారి పోచమ్మ, ఎల్లమ్మ, దుర్గమ్మ, దేవమ్మ, లాంటి దేవతల మొక్కులకు అమ్మవారి ప్రతిమలు జ్యువెలర్స్ షాపులలో కొనుక్కోలు చేయడం సహజ సిద్ధం. వాటిని వారి ఇష్ట దైవంగా కొలిచి వారిది మొక్కులను తీర్చుకుంటారు. కానీ వెండి విగ్రహాలు అని చెప్పి కొందరు దళారులు ప్రజలను మోసం చేస్తున్నారు. ఇదే అదునుగా చూసి జ్యువెలర్స్ షాప్ యజమాన్యులు మొక్కులకు ఉపయోగపడే వస్తువులు వెండివని అని చెప్పి ప్రజల వద్ద భారీగా దోచుకుంటున్నారు. ప్రజలు మొక్కలు తీసుకుంటున్నామని సంకల్పంతో అవి వెండియే కావచ్చని జ్యువెలర్స్ షాప్ లలో తీసుకొని వెళ్ళిపోతున్నారు.జువెలరీ షాప్ లలో మొక్కలకు సంబంధించినటువంటి శ్రీ లక్ష్మీనరసింహ నామాలు మీసాలు,అమ్మవారి ప్రతిమలు, కండ్లు,దర్గాకు సంబంధించినటువంటి గుర్రపు ప్రతిమలు భారీగా అమ్మడం జరుగుతుంది. ఇకనైనా అధికారులు పట్టించుకుని షాపులలో తనిఖీలు చేస్తే ఇలాంటివి జరగకుండా ఉంటాయని ప్రజలు కోరుతున్నారు.ఈ ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు స్పందించాలని కోరారు.
