Take a fresh look at your lifestyle.

అవగాహన సామర్థ్యాన్ని పెంపొందించాలి….

0 1,257

అవగాహన సామర్థ్యాన్ని పెంపొందించాలి

  • బాల్కొండ ఎంఈఓ బట్టు రాజేశ్వర్

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి , జులై 30  ( లోకంతీరు ) : బాల్కొండ మండల కేంద్రంలో విద్యార్థులలో అవగాహన సామర్ధ్యాన్ని పెంపొందించేందుకు భాషను బోధించే ఉపాధ్యాయులు కృషి చేయాలని బాల్కొండ మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ కోరారు. మంగళవారం నాడు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో నిర్వహించిన తెలుగు ఉపాధ్యాయుల స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పిల్లలు ధారాళంగా చదివి, విషయాన్ని అవగాహన చేసుకుంటే వారు ఇతర సామర్ధ్యాలైనా స్వీయ రచన సృజనాత్మకత వ్యాకరణ అంశాలలోను మెరుగ్గా రాణిస్తారని వాటన్నిటికీ మూలమైన అవగాహన ప్రతిస్పందన సామర్ధ్యం పై ఉపాధ్యాయులు దృష్టి పెట్టాలని ఆయన కోరారు. నవంబర్ మాసంలో జరిగే నేషనల్ అచీవ్మెంట్ సర్వేకు విద్యార్థులను సిద్ధం చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ రిసోర్స్ పర్సన్ ఘనపురం దేవేందర్, డిస్టిక్ రిసోర్స్ పర్సన్ నాగుల రాజేందర్ గౌడ్, కాంప్లెక్స్ కార్యదర్శి శ్రీలక్ష్మి బాల్కొండ ఆర్మూర్, ముప్కాల్, మెండోరా, ఆలూరు మండలాల చెందిన తెలుగు ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాంప్రభు, ‌సౌడ రవి, వివేకవర్ధన్, హారతి, అహల్య, బోచ్కర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.