Take a fresh look at your lifestyle.

 మంగళ్ పాడ్ లో మురికి కాలువలు శుభ్రం చేస్తున్న జిపి సిబ్బంది….

0 1,184

 మంగళ్ పాడ్ లో మురికి కాలువలు శుభ్రం చేస్తున్న జిపి సిబ్బంది

ఎడపల్లి , నవంబర్ 02 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలంలోని మంగళ్ పాడ్ గ్రామంలో ప్రజల ఆరోగ్యమే తమ ద్యేయం అని , గ్రామీణ ప్రాంతాలు శుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని గ్రామపంచాయతీ కార్యదర్శి రామ్ రెడ్డి స్పష్టం చేశారు. ఎడపల్లి మండలం మంగల్ పహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలో గల మురికి కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ఆయన దగ్గరుండి శుభ్రం చేయించారు. మురికి కాలువ లోని తీసిన చెత్తాచెదారాన్ని బుధవారం గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా ఆయన డంపింగ్ యార్డ్ తరలించారు. పంచాయతీ పరిధిలో 10 వార్డులలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని పారిశుద్ధ కార్మికుల చేత తీసివేసి గ్రామాన్ని శుభ్రపరచడంలో తమ వంతు కృషి చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. భయంకరమైన వ్యాధుల. నుండి ప్రజలు భయ పడకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా మురికి కాలువలుశుభ్రతముమ్మరంగా ఉండాలనిఆయన తెలిపారు . అలాగే మంచినీటి ట్యాంకు లా ద్వారా ప్రజలకు సరపరయ్యే మంచినీటి ట్యాంకును పక్షంలోఓసారి బ్లీచింగ్ పౌడర్ తోశుభ్రపరిచిన అనంతరం మంచినీటి కుళాయిల ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన నీరును అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే గ్రామపంచాయతీకి ఇందులో పనిచేసే సిబ్బందికి అధికారులకు మంచి పేరు వస్తుందని ఆయన ఆశ భవన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ కార్యదర్శి రామిరెడ్డి తో పాటు బిల్ కలెక్టర్ పద్మావతి సిబ్బంది. శ్రీనివాస్ కుంట సంతోష్, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని వారు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.