Take a fresh look at your lifestyle.

డాక్టర్ ఎడవల్లి కృష్ణకు గౌరవ డాక్టరేట్ .

0 14

డాక్టర్ ఎడవల్లి కృష్ణకు గౌరవ డాక్టరేట్ .

ప్రధానం చేసిన మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ. 
విద్యా, సామాజిక సేవలకు అంతర్జాతీయ గుర్తింపు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, జూలై 20: ప్రముఖ విద్యావేత్త, సామాజిక సేవకుడు, పెద్దపల్లిలోని మదర్ థెరిసా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఎడవల్లి కృష్ణకు అమెరికాలోని మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ (పీహెచ్.డి. ఇన్ ఎడ్యుకేషన్) ప్రదానం చేశారు. న్యూఢిల్లీ ఇండియా హ్యాబిటాట్ సెంటర్‌లో నిర్వహించిన ‘ఇండో ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ కాన్‌క్లేవ్’ కాన్వొకేషన్ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్‌తో పాటు పలువురు ప్రముఖుల సమక్షంలో డాక్టర్ ఎడవల్లి కృష్ణ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. విద్యారంగంలో మదర్ థెరిసా విద్యాసంస్థల ద్వారా అందిస్తున్న విశిష్ట సేవలు, సామాజిక అభివృద్ధికి చేస్తున్న కృషిని గుర్తించి ఈ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. డాక్టర్ ఎడవల్లి కృష్ణ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువయ్యారు. ఎంజేఎఫ్ (మెల్విన్ జోన్స్ ఫెలో) లయన్‌గా ఆయన విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్నారు. లయన్స్ సంస్థలోనూ ఆయనకు ఉన్నత బాధ్యతలు దక్కనున్నాయని సహచరులు పేర్కొన్నారు. డాక్టర్ ఎడవల్లి కృష్ణకు గౌరవ డాక్టరేట్ లభించడం పట్ల యూకేఎఫ్ ప్రతినిధులు, శ్రేయోభిలాషులు, విద్యావేత్తలు, లయన్స్ క్లబ్ సభ్యులు, తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.