
సత్తుపల్లిలో ఘనంగా సండ్ర వెంకట వీరయ్య జన్మదిన వేడుకలు
సేవా కార్యక్రమాలతో పుట్టినరోజు వేడుకలు.. శుభాకాంక్షలు తెలిపిన బీఆర్‌ఎస్ శ్రేణులు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
సత్తుపల్లి, ఆగస్టు 15: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు సండ్ర వెంకట వీరయ్య జన్మదిన వేడుకలను బీఆర్‌ఎస్ శ్రేణులు శనివారం సత్తుపల్లిలో ఘనంగా నిర్వహించాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సండ్ర వెంకట వీరయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా సండ్ర వెంకట వీరయ్య క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం మహిళా నాయకులు కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి నుంచి బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీగా సత్తుపల్లి బస్‌స్టాండ్ సెంటర్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ కేక్ కట్ చేసి సండ్ర జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం సత్తుపల్లి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. కొత్తూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో, ఎన్టీఆర్ కాలనీలో, 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అన్నప్రసాదం అందించారు. పదవుల్లో ఉన్నా లేకపోయినా ప్రజలతో మమేకమై, పార్టీ శ్రేణులకు అండగా నిలుస్తూ సత్తుపల్లి ప్రజల కోసం నిరంతరం పనిచేసిన సండ్ర వెంకట వీరయ్య నాయకత్వం కొనసాగాలని బీఆర్‌ఎస్ శ్రేణులు ఆకాంక్షించారు. ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ మరింత కాలం ప్రజాసేవలో కొనసాగాలని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కూసంపూడి మహేష్, కొత్తూరు ఉమామహేశ్వరరావు, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, దొడ్డ శంకరరావు, మోరంపూడి ప్రభాకర్, వీరపనేని బాబీ, షేక్ రఫీ, మల్లూరి అంకంరాజు, సత్తుపల్లి మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్లు, పట్టణ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, సండ్ర వెంకట వీరయ్య అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.