అన్ని యూనియన్లకు సమాన హోదా కల్పించాలి.
టీబీజీకేఎస్ నాయకుల వినతి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
రామగిరి, సెప్టెంబర్ 14:సింగరేణిలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల కాలపరిమితి ముగిసినందున వెంటనే గుర్తింపు సంఘ ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికలు జరిగే వరకు అన్ని కార్మిక సంఘాలకు సమాన అవకాశాలు కల్పించాలని టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ నాగెల్లి సాంబయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-1, -2, సీహెచ్‌పీ, ఎస్ అండ్ పీసీ, అడ్రియాల గనుల వద్ద టీబీజీకేఎస్ నాయకులు కాలనీ మేనేజర్లకు వినతిపత్రాలు అందజేశారు. ఎన్నికలు నిర్వహించేంతవరకు సేఫ్టీ, మైన్స్ మీటింగ్‌లు, ఇతర అధికారిక కార్యక్రమాల్లో అన్ని యూనియన్లకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ నాయకులు పింగిలి సంపత్‌రెడ్డి, బోయినపల్లి శ్రీకాంత్‌రావు, ఈసంపల్లి రమేష్, గట్టు శ్రీనివాస్, దేవ శ్రీనివాస్, పాశం శ్రీనివాస్‌రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.