Take a fresh look at your lifestyle.

మహిళలు స్వయంశక్తితో ముందుకు రావాలి….

0 1,234

మహిళలు స్వయంశక్తితో ముందుకు రావాలి

కామారెడ్డి జిల్లా /రాజంపేట , సెప్టెంబర్ 27 ( లోకంతీరు ) : రాజంపేట మండల కేంద్రంలో శుక్రవారం మహిళా సంఘ భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిపిఎం రమేష్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫిష్ పాండ్ నిర్మాణంపై అవగాహన కల్పించారు. చేపల పెంపకం నిర్వహణ విధి విధానాలు బ్యాంకు లోన్ సబ్సిడీ వివరాలను వివరించారు. పిఎం ఈజిపి క్రింద సబ్సిడీ ప్రతి లక్ష రూపాయలకు 35 శాతం చొప్పున ఇవ్వబడుతుందన్నారు. ఒక యూనిట్ 3 లక్షల వరకు ఇవ్వవచ్చని, కావున లబ్ధిదారులు వీటిని ఉపయోగించుకొని వారి యొక్క అభివృద్ధిని సంపాదించుకోవాలని సూచించారు. అలాగే తలమడ్ల గ్రామంలో అల్లె భూమవ్వ నిర్వహిస్తున్న ఫిష్ పాండ్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎల్ డి ఎం, ఎంపిడిఓ, ఏ పి ఓ, ఏ పి ఎం, సిసి, వి ఓ ఎ లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.