Take a fresh look at your lifestyle.

అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి :  మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి.

0 2

అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి :  మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై బీఆర్ఎస్ సమీక్ష.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, అక్టోబర్ 25: రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ఓటరు నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి సూచించారు. ఆదివారం మొగుళ్లపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన, ఓడీసీఎంఎస్ రాష్ట్ర మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి రామస్వామి నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం పురోగతిని నాయకులతో సమీక్షించారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడూ ఓటరుగా నమోదు చేసుకునేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాల్లోని అర్హులైన పట్టభద్రులను గుర్తించి, ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల భాగస్వామ్యం పెరిగేలా ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మొగుళ్లపల్లి మండల బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టిబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఓటరు నమోదుపై అవగాహన:

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీ ఎండీ క్వార్టర్స్‌లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టిబీజీకేఎస్) ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. డిగ్రీ అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని టిబీజీకేఎస్ భూపాలపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ బడితెల సమ్మయ్య నాయకత్వంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టిబీజీకేఎస్ సెంట్రల్ జాయింట్ సెక్రటరీ రత్నం అవినాష్, కేటీకే-1 ఇంక్లైన్ పిట్ సెక్రటరీ మల్లారెడ్డి, తమ్మ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.