Take a fresh look at your lifestyle.

పకడ్బందీగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు….

0 1,249

పకడ్బందీగా ప్రాక్టికల్ పరీక్షలు…..

  • జిల్లా ఇంటర్ విద్యా అధికారి రఘురాజ్

నిజామాబాద్, జనవరి 29 ( లోకం తీరు ) : ఫిబ్రవరి 1వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఇంటర్ విద్యార్థి శ్రీ రఘురాజ్ అన్నారు. సోమవారం నిజామాబాద్ ప్రభుత్వ బాలుర( ఖిల్లా) కళాశాలలో ప్రభుత్వ, అన్ని రెసిడెన్షియల్ కళాశాలల, ప్రైవేటు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని మొత్తం జనరల్ విద్యార్థులకు 55 పరీక్ష కేంద్రాలలో, ఒకేషనల్ విద్యార్థులకు20 పరీక్ష కేంద్రాలలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించడానికి ప్రయోగశాలలు సిద్ధం అయ్యాయని అన్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాలను జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కార్యాలయం నుండి అన్ని కళాశాలలకు పంపడం జరుగుతుందని అన్నారు. ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని జనరల్ రెండవ సంవత్సరం విద్యార్థులకు, ఒకేషనల్ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలను నిర్వహించేందుకు ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ లు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు.

మొదటి సంవత్సరం విద్యార్థులకు, రెండవ సంవత్సరం విద్యార్థులకు వేరు వేరుగా బ్యాచుల వారీగా పరీక్షలు నిర్వహించడానికి ప్రయోగశాలలను సిద్ధం చేయాలని ఆదేశించారు. మొత్తం మూడు విడుతలు గా ప్రయోగ పరీక్షలను ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి 15 వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు జిల్లా ఇంటర్ విద్యా అధికారి అన్నారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటారని ఏ సమస్య అయినా పరీక్షల నిర్వహణ కమిటీ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు గాను ఎగ్జామినర్ల నియామకాలను చేపడుతుందని జిల్లా ఇంటర్ విద్య అధికారి శ్రీ రఘురాజ్ తెలియజేశారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు హాల్ టికెట్లను ఇదివరకే బోర్డు ఆన్ లైన్ లో ఆయా కళాశాలల లో అందుబాటులో ఉంచిందని, విద్యార్థులకు హాల్ టికెట్లను పంపిణీ చేయాలని అన్ని కళాశాలల ప్రిన్సిపాల్ లను జిల్లా ఇంటర్ విద్యాధికారి ఆదేశించారు. పరీక్షల లో పాల్గొనే విద్యార్థులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా వారిని అనుమతించాలని ఆదేశించారు. ప్రయోగ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకు, అధ్యాపకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కళాశాలల లో భౌతిక అవసరాలు తీర్చుకునేందుకు మంచినీటి వసతి, మరుగుదొడ్లు ఏర్పాట్లను పూర్తిచేయాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. అలాగే పరీక్ష నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఆదేశించారు.

పరీక్ష పత్రాలను ఆన్ లైన్ లో డౌన్లోడ్ చేసుకునేందుకు పరీక్షల నిర్వహణ ఎగ్జామినర్లకు కోడ్ పంపడం జరుగుతుందని, ఆ కోడ్ ఆధారంగా ప్రశ్న పత్రాలను పరీక్షకు ముందు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలియజేశారు. జనరల్ విద్యార్థులు మొత్తం 17,950 మంది, ఒకేషనల్ విద్యార్థులు మొదటి సంవత్సరం 2,397 మంది రెండవ సంవత్సరం విద్యర్థులు1,991 మంది పరీక్షలకు హాజరుకానున్నారని తెలియజేశారు. పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు శ్రీ రవికుమార్, శ్రీ రజియుద్దిన్ అస్లాం, శ్రీ దేవరాం కూడా ప్రయోగ పరీక్ష నిర్వహణపై ఆయా కళాశాలల ప్రిన్సిపల్ లకు సూచనలు, సలహాలు, నిర్వహణ, ప్రయోగ పరీక్షల ప్రక్రియను వివరించారు.ఈ సమావేశంలో ప్రభుత్వం అధ్యాపకుల సంఘం అధ్యక్షులు శ్రీ నరసయ్య, బాలుర కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ గోపాల్ సమావేశంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.