Take a fresh look at your lifestyle.

ధర్మయుద్ధ మహాసభ పోస్టర్లు ఆవిష్కరణ….

0 1,193

ధర్మయుద్ధ మహాసభ పోస్టర్లు ఆవిష్కరణ

కామారెడ్డి జిల్లా,  అక్టోబర్ 24 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గ్రామం ఎమ్మార్పీఎస్ ధర్మ యుద్ధ మహాసభ పోస్టర్లు గురువారం ఎమ్మార్పీఎస్ నాయకులు ఆవిష్కరించారు. ఈ నెల 28 తేదీన మందకృష్ణ మాదిగ ఎస్ ఆర్ గార్డెన్ లో జరిగే సమావేశానికి ఉమ్మడి జిల్లా సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేస్తున్న సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మాదిగలు, మాదిగ ఉపకులాలు తరలిరావాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర, మాజీ కార్యదర్శి ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి మైలారం బాలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మహిళా నాయకురాలు సత్తి గారి లక్ష్మి, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు కొత్తూరు యాదగిరి, పుల్లూరి పురుషోత్తం, గుండెల్లి కాశి రాములు, మండల అధ్యక్షుడు మాచారెడ్డి బట్ట రమేష్, రామారెడ్డి మహిళా అధ్యక్షురాలు లావణ్య, బాణాపురం బుజ్జిగాని రాకేష్, జాను, మాచారెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.