Take a fresh look at your lifestyle.

బీసీల సంక్షేమానికి కృషి…

0 1,572

బీసీల సంక్షేమానికి కృషి

  • ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
  • ఎమ్మెల్సీకి బీసీ నాయకుల సన్మానం

నిజామాబాద్, ఫిబ్రవరి 18 ( లోకంతీరు ) :  కామారెడ్డి బీసీ డిక్లరేషన్, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సమగ్ర కుల గణన తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం జరిగిందని, బీసీల సంక్షేమానికి, అభివృద్ధికి, పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఎనుగందుల మురళీ అధ్వర్యంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను జిల్లా కేంద్రంలోని అయన స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిసి, సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ …కుల గణన ఆమోదం సంతోషకరమని, ఎన్నో ఏళ్ల కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఆమోదం లో పాలుపంచుకోవడాన్ని జీవితంలో మర్చిపోలేనన్నారు. బీసీ ప్రజాప్రతినిధుల కృషి అమోఘమని కొనియాడారు. కుల గణనతో మెజార్టీ వర్గాలైన బీసీలకు సముచిత స్థానాలు దక్కుతాయని, అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుందని వివరించారు. కుల గణన పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేసిందని హామీ ఇచ్చారు. బీసీల అభ్యున్నతికి కృషి చేస్తానని, సమస్యల సాధనలో రాజీపడే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు.

ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, మురళీ, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవంత్ లు మాట్లాడుతూ…. నిజామాబాద్ బీసీ ముద్దు బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ కు ఎమ్మెల్సీ రావడం సంతోషకరమన్నారు. కరడుగట్టిన కాంగ్రెస్ వాది అయిన మహేష్ కుమార్ గౌడ్ కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్ల కలయిన కుల గణన ఆమోదానికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధు గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళ అధ్యక్షురాలు స్వప్న అధ్వర్యంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధికార ప్రతినిధి అమంద్ ప్రవీణ్ కుమార్, నగర కార్యదర్శి కస్తూరి కృష్ణ, సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.