వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అభిమానుల పాదయాత్ర
-
కొనరావు పేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాష

కామారెడ్డి జిల్లా/ రామారెడ్డి , ఫిబ్రవరి 27 ( లోకంతీరు ) : వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ తరఫున గెలుపొందిన శుభ సందర్భంగా ఎమ్మెల్యే అభిమానులు సీనియర్ కార్యకర్త కొనరావుపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా తో పాటు మంగపల్లి శోభన్ బాబు, తాళ్లపల్లి ప్రభాకర్,మంగళవారం వేములవాడ నుండి కామారెడ్డి జిల్లా బడా పహాడ్ దర్గా వద్దకు బయలు దేరడం జరిగింది. పాదయాత్రలో భాగంగా మార్గమధ్యలో రామారెడ్డి మండలం కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు వారిని ఘనంగా సత్కరించి శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా కొనరావుపేట్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఫిరోజ్ షేక్ పాషా మాట్లాడుతూ ఎన్నికలలో గెలుపొందిన శుభ సందర్భంగా పవిత్రమైన దర్గా బడాపహాడ్ కు పాదయాత్రతో వస్తామని మొక్కులు చెల్లించుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాయణం మండల సీనియర్ కార్యకర్తలు ఫారుక్, రాహుఫ్, నామాల లింబాద్రి,బిపేట నర్సింలు, వడ్ల లక్ష్మి రాజ్యం,పిప్పరి గణేష్, అజ్ఞాన్ తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.