గ్రామ బిజెపి ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా

కామారెడ్డి జిల్లా , జూలై 23 ( లోకంతీరు ) : జిల్లాలోని రాజంపేట మండలంలోని గ్రామ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు 157 బూతు అధ్యక్షులు కమ్మరి నాగరాజు మంగళవారం రోజు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవులకు సరియైన న్యాయం చేయనందున గ్రామ ప్రధాన కార్యదర్శి మరియు 157 బూతు అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు కమ్మరి నాగరాజు తెలిపారు. అనంతరం పార్టీకి సామాన్య కార్యకర్తగా కొనసాగుతానని తెలిపారు.