Take a fresh look at your lifestyle.

వారసత్వానిగా వచ్చిన భూమిని తన పేరుపై ఎక్కించాలి….

0 1,195

వారసత్వానిగా వచ్చిన భూమిని తన పేరుపై ఎక్కించాలి

– రామరెడ్డి తహసిల్ అధికారుల నిర్వాకం
– పురుగుల మందు తగిన బాధితుడు

కామారెడ్డి జిల్లా , ఆగస్టు 27 (లోకంతీరు) : జిల్లాలోని రామరెడ్డి మండలం ఉప్పల్ వాయి గ్రామానికి చెందిన రైతు మంత్రి భగవాన్ తన యొక్క వారసత్వం భూమి తన తండ్రి మంత్రి మొగులయ్య పేరుపైన ఉన్న సర్వే నంబర్ 856/68 ఒక ఎకరం భూమిని తన పేరుపైన చేయడం లేదని రామారెడ్డి తహసిల్దార్, అధికారులు చేయడం లేదని మనస్థాపనతో మంగళవారం పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి తహసిల్దార్ కార్యాలయం ముందు చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఉప్పల్ వాయి గ్రామానికి చెందిన రైతు మంత్రి భగవాన్ మీడియాతో మాట్లాడుతూ గత 10, 15 సంవత్సరాలుగా రామారెడ్డి తహసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగిన అధికారులు పట్టించుకోవడం లేదని మా తండ్రి మంత్రి మొగులయ్య పేరుపైన ఉన్న ఒక ఎకరం భూమిని నా పేరు చేయమని అధికారుల చుట్టూ తిరిగిన అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. మనస్థాపనతో పురుగుల మందు తాగి చనిపోవాలని నిర్ణయించుకోవడం జరిగిందని తెలిపారు. అడిగినప్పుడల్లా చేస్తాను అనడం జరుగుతుంది. కానీ పని చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం చొరవ చూపి వారసత్వానిగా వచ్చిన భూమిని నా పేరుపై చేయాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.