సింగరేణి భూపాలపల్లి ఏరియా ఉత్తమ ఉద్యోగులు వీరే.
వెల్లడించిన ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, ఆగస్టు 13: విధుల్లో ప్రతిభ, నైపుణ్యం, క్రమశిక్షణ, సమర్థత కనబరిచిన సింగరేణి కార్మికులను ప్రోత్సహించే ఉద్దేశంతో భూపాలపల్లి ఏరియాలో ఈ ఏడాది ఉత్తమ ఉద్యోగులను ఎంపిక చేసినట్లు ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపికైన ఉత్తమ ఉద్యోగులను ఆగస్టు 15న జరిగే వేడుకల్లో సన్మానించి అవార్డులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను ఎంపిక చేసి సన్మానించడం సింగరేణి సంస్థలో ఆనవాయితీగా వస్తోందని జీఎం తెలిపారు. అదే సంప్రదాయంలో ఈ ఏడాది కూడా వివిధ గనులు, విభాగాల్లో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. కేటీకే-1 గని నుండి చెరుకూరి కిశోర్, సీనియర్ మైనింగ్ సర్దార్, రావుల రాజయ్య, కోల్ కట్టర్, కేటీకే-5 గని నుండి బండారి తిరుపతి, హాలేజ్ ఆపరేటర్, భూక్యా హీరాలాల్ సపోర్ట్ మెన్, కేటీకే-6 గని నుండి తాతగట్టు స్వామి, కోల్ కట్టర్, భూక్యా రాములు, ఎస్డీఎల్ ఆపరేటర్, కేటీకే-8 గని నుండి కొలను రవీందర్, ఫిట్టర్, కక్కెర్ల శ్రీనివాస్, హెడ్ ఓవర్ మెన్, కేటీకే-ఓసీ-3 నుండి గఢర్ల తిరుపతయ్య, హెడ్ ఓవర్‌మెన్, మేరుగు ప్రవీణ్ కుమార్. సీనియర్ అసిస్టెంట్, కేటీకే-ఓసీ-2 నుండి మేక సుధాకర్, జనరల్ అసిస్టెంట్, బండ బాపు, ఎంవీ డ్రైవర్ లు ఏరియా నుండి ఉత్తమ ఉద్యోగులుగా ఎన్నికయినట్లు జిఎం వివరించారు. అలాగే భూపాలపల్లి కేటీకే-ఓసీ-2కు చెందిన సామ కృష్ణ, ఈపీ ఆపరేటర్‌ను ఉత్తమ సింగరేణియన్‌గా ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఆయనను కొత్తగూడెంలో సింగరేణి సీఎండీ చేతుల మీదుగా సన్మానించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన ఉద్యోగులు తమకు కేటాయించిన విధులను నైపుణ్యం, క్రమశిక్షణతో సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు సంస్థ అభివృద్ధికి చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుని ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 15న భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఏరియా జీఎం చేతుల మీదుగా వీరిని సన్మానించి అవార్డులు అందజేయనున్నారు. ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైన వారిని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి, ఎస్‌ఓటూజీఎం డీ. శ్యాంసుందర్, పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యాంసుందర్, వివిధ గనుల అధికారులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.